Jagan: జగన్ ను ఇంకా మభ్యపెడుతున్నారు

Jagan: గత ఎన్నికల్లో వైసిపి అంతులేని విజయం సాధిస్తుందని అవే సర్వే సంస్థలు చెప్పాయి. ఇప్పుడు అవే సర్వే సంస్థల ఫలితాలను వైసీపీ కొట్టి పారేస్తుంది. మాకంటూ ఒక ప్రత్యేకమైన ఓటర్లు ఉన్నారని..

Written By: Dharma, Updated On : June 3, 2024 12:08 pm

Jagan

Follow us on

Jagan: జగన్ వైసీపీ శ్రేణులకు మోసం చేస్తున్నారా? లేకుంటే జగన్ ను కుహనా మేధావులు పక్కదారి పట్టిస్తున్నారా? ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఓవైపు వైసీపీకి ఘోర పరాజయం తప్పదని జాతీయ సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. అయినా సరే ఇప్పటికీ కుహనా మేధావులు కొందరు వైసీపీ గెలుస్తుందని చెప్పడం విశేషం. చివరకు సాక్షిలో సైతం వైసీపీకి అనుకూల ఫలితాలు ఇచ్చిన ఓ నాలుగు సర్వేలను మాత్రమే వెల్లడించారు. వాటిని తిప్పి తిప్పి ఎత్తి చూపించారు.మరోవైపు తనను కలిసేందుకు వస్తున్న నేతలకు మనదే గెలుపు అని ధైర్యవచనాలు చెబుతున్నారు జగన్.

Also Read: Aaraa Mastan Survey: ఆరా మస్తాన్ టార్గెట్

గత ఎన్నికల్లో వైసిపి అంతులేని విజయం సాధిస్తుందని అవే సర్వే సంస్థలు చెప్పాయి. ఇప్పుడు అవే సర్వే సంస్థల ఫలితాలను వైసీపీ కొట్టి పారేస్తుంది. మాకంటూ ఒక ప్రత్యేకమైన ఓటర్లు ఉన్నారని.. వారిచ్చిన తీర్పుతో విజయం సాధిస్తామని వైసీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. అయితే ధీమా వరకు పరవాలేదు కానీ.. ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్తే అసలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో జగన్కు రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళుతున్నట్లు సమాచారం. ఇప్పటికీ కొంత మంది వైసీపీ నేతలు, ఎనలిస్టులు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. దానిని బలంగా నమ్ముతున్న జగన్.. అతి ధీమాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే కౌంటింగ్ వరకు పార్టీ శ్రేణులను తీసుకెళ్లాలంటే వారితో అలా మాట్లాడించాలని నాయకత్వం ఒప్పందం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

Also Read: AP Exit Polls: మరో నిక్కచ్చి సర్వే.. ఏపీలో గెలుపు ఎవరిదంటే?

సాక్షి మీడియాలో సైతం సర్వేల హడావిడి అంతంత మాత్రమే. వైసిపి గెలుస్తుందన్న లోకల్ మీడియా సంస్థల సర్వేలు, తాడేపల్లి ప్యాలెస్ కు చెందిన టైం నౌ ఈ టీజీ వంటి సర్వేలను తిప్పితిప్పి సాక్షి మీడియాలో ప్రచురిస్తున్నారు. ప్రసారాలు చేస్తున్నారు. అంతకుమించి జాతీయ మీడియా సంస్థల సర్వేలు కూడా కనిపించలేదు. నిన్నటి వరకు అభిమానంగా ఉండే.. ఎన్డి టీవీ, ఇండియా టుడే ఛానల్ సర్వేలు కూడా ప్రసారం చేయలేని స్థితికి సాక్షి మీడియా చేరుకుంది. చివరకు బోటా బోటీగా నైనా వైసీపీ గెలుస్తుందని ఆరా మస్తాన్ తో ఒప్పించి చెప్పినట్టు కనిపిస్తున్నారు. మరోవైపు వైసీపీకి అనుకూలంగా విశ్లేషించే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సైతం.. ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు. వైసీపీకి చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇలా అందరూ కలిసి జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్ సైతం పార్టీ శ్రేణులకు మభ్యపెడుతున్నారు.