https://oktelugu.com/

Tulasi: ఇంట్లో తులసి మొక్క పెరగడం లేదా? ఇలా చేయండి..

Tulasi: ఇంట్లో తులసి మొక్క పెరగడం లేదా? ఇలా చేయండి..

Written By:
  • Srinivas
  • , Updated On : June 3, 2024 / 11:39 AM IST

    tulasi plant vasthu tips telugu

    Follow us on

    Tulasi: హిందూ సాంప్రదాయాల్లో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని ఆధ్యాత్మికంగానూ, ఔషధంగానూ ఉపయోగిస్తారు. హిందువులైన దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. మొక్కల్లో పరమ పవిత్రంగా భావించే తులసి మొక్కకు ప్రతిరోజూ పూజలు చేసేవారు ఉన్నారు. షోడశోపచార పూజా విధానంలో తులసికి విశిష్ట స్థానం ఉంది. అందువల్ల పూజల్లో తులసి దళాలు తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. అంతేకాకుండా వినాయక చవితి మొదటి పూజలో గణనాథునికి సమర్పించే పత్రిపూజలో తులసి ఉంటుంది. అయితే చాలా మంది ఇళ్లల్లో తులసి ఉన్నా సరిగ్గా పెరగదు. తులసి మొక్క ఏపుగా పెరగాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.. అవేంటంటే?

    మిగతా మొక్కల కంటే తులసి మొక్క ప్రత్యేకమైంది. సాధారణ మొక్కలకు ప్రతిరోజూ నీరు పోస్తుంటాం. కానీ తులసి మొక్కకు స్వచ్ఛమైన నీరు ఇస్తుంటారు. అయితే తులసి కోటలో ఎక్కువగా నీరు ఉండడం వల్ల ఫంగస్ తయారై చెట్టు పెరగదు. అంతేకాకుండా దీని ఆకులు మాడిపోయినట్లు కనిపిస్తాయి. ఈ పరిస్థితిని చాలా మంది ఆ మొక్కను పడేసి కొత్తదానిని తెచ్చుకుంటారు. కానీ ఆ మొక్క పచ్చగా ఉండే ఏపుగా పెరగాలంటే ఇలా చేయాలి.

    తులసి మొక్క పెరగడం లేదని గ్రహించినప్పడు కొత్త మట్టిని మార్చాలి. ఈ కొత్త మట్టి వల్ల ఇందులో ఇసుక రేణువులతో పాటు వర్మీ కంపోస్టు ఉంటుంది. అయితే తేమ లేని మట్టిని మాత్రమే తీసుకొని మొక్కలో ఉంచాలి. అప్పటి నుంచి నీరు కొద్దిగా పోస్తూ ఉండాలి. అలాగే తులసి కోటలు నీరు నిలవకుండా బయటకు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తులసి మొక్కను నాటే టప్పుడు కనీసం నాలుగు నుంచి 5 అంగుళాల లోతు ఉండేలా చూసుకోవాలి. కాస్త లోతుగా ఉండడం వల్ల పట్టిష్టంగా ఉంటుంది.

    తులసి మొక్కకు మట్టి కుండను మాత్రమే వాడడం మంచిది. మట్టి కుండ వల్ల ఎక్కువగా తేమ ఉంటూ మొక్కకు ఆరోగ్యాన్ని ఇస్తూ పచ్చగా ఉండేలా చూస్తుంది. మొక్కను నాటే ముందు కుండలో కాగితాన్ని ఏర్పాటు చేయడం వల్ల మరింత తేమను కలిగి ఉంటుంది. మొక్కకు పోషకాలు అందించడానికొబ్బరి పీచు లేదా బెరడు మొక్కలు కలపవచ్చు. ఆవు పేడ పిండిని ఎండబెట్టి పొడిని తయారు చేసి తుల మొక్కలో ఉన్న మట్టిలో కలపాలి. దీంతో తులసి చెట్టు ఏపుగా పెరుగుతుంది.