Aaraa Mastan Survey: సర్వేలు చేయడంలో ఆరా మస్తాన్ ముందంజలో ఉండేవారు. ఆయన చేసిన సర్వేలు చాలా వరకు ఫలించాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఆయన అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అదే అనుభవంతో ఏపీ ఎన్నికల విషయంలో సర్వే ఫలితాలను ప్రకటించారు. అప్పటినుంచి ఆయన టిడిపి కూటమి పార్టీలకు టార్గెట్ అయ్యారు. ఈనెల ఒకటిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు(Exit Poll Results) ప్రకటించారు. జాతీయ సర్వే సంస్థలు, మెజారిటీ ఏజెన్సీలు ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తాయని స్పష్టం చేశాయి. అయితే ఆరా మస్తాన్ మాత్రం ఏపీలో వైసీపీ(YCP) మరోసారి గెలవబోతుందని స్పష్టం చేశారు. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించారు. ఆరా మస్తాన్ సర్వేను వైసీపీ శ్రేణులు ఆహ్వానించగా.. కూటమి పార్టీలు వ్యతిరేకించడం ప్రారంభించాయి.
Also Read: AP Exit Polls: మరో నిక్కచ్చి సర్వే.. ఏపీలో గెలుపు ఎవరిదంటే?
అందరూ మాదిరిగానే ఆరా మస్తాన్ తన సర్వే వివరాలను వెల్లడించారు. అందులో వైసిపి గెలుస్తుందని కూడా నాలుగు, ఐదు సంస్థలు చెప్పుకొచ్చాయి కానీ ఒక్క ఆరా మస్తాన్ మాత్రమే టార్గెట్ అయ్యారు.వాస్తవానికి పోలింగ్ తర్వాత వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేకత, ఎన్నికల నిర్వహణలో కూటమికి ఈసి సాయం, ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఓటు వేయడం తదితర కారణాలతో.. వైసిపి ఓటమి ఖాయమన్న సంకేతాలు వచ్చాయి.కానీ సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు స్పష్టమైన ధైర్యం పంపారు. గత ఎన్నికల కంటే అధిక స్థానాలు గెలవబోతున్నామని ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ధీమా ప్రారంభమైంది. జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పే దాకా వెళ్ళింది. అటు వైసిపి అభ్యర్థులకు సైతం మనదే విజయం అంటూ జగన్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీలో ఒక రకమైన అలజడి ప్రారంభమైంది. కానీ ఇంతలోనే ఆరా మస్తాన్ సర్వే వారికి బూస్టింగ్ ఇచ్చింది. ఇది కూటమి శ్రేణులకు మింగుడు పడని అంశం.
Also Read: Chandrababu: చంద్రబాబు వ్యూహం సక్సెస్
నిన్నటి వరకు ఆరా మస్తాన్ అంటే గౌరవించే వారు వ్యతిరేకించడం ప్రారంభించారు. ఆయన వైసీపీకి అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నారు. మరి కొందరైతే సవాల్ చేస్తున్నారు. కూటమి గెలవకపోతే తాను నాలుక కోసుకుంటానని.. గెలిస్తే ఆరా మస్తాన్ కోసుకుంటారా అంటూ బుద్దా వెంకన్న సవాల్ చేశారు. సోషల్ మీడియాలో ఆరా మస్తాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. జగన్ ఎమ్మెల్యే సీటుకు ఆఫర్ చేయడంతోనే.. ఆయన అనుకూల సర్వే ఇచ్చారని చెబుతున్నారు. జాతీయ సర్వే సంస్థలు అంచనా వేసినట్టు టిడిపి కూటమి గెలిస్తే.. ఆరా మస్తాన్ మరింత టార్గెట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.