Chandrababu Naidu : ఎస్.ఈశ్వరన్.. అమరావతి ఫేమ్ లో ఉన్నప్పుడు తరచూ వినిపించే పేరు ఇది. సింగపూర్ రవాణా శాఖ మంత్రి ఈయన. భారత సంతతికి చెందిన వారు. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. అమరావతి లో కీలక నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇటీవల మంత్రి పదవికి దూరమయ్యారు. మాజీ అయ్యారు. అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి బయటకు వచ్చారు. అయితే సింగపూర్ తో ఆంధ్రాకు లింకులున్నాయని.. త్వరలో చంద్రబాబు అరెస్ట్ ఖాయమని వైసీపీ ప్రచారం ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అన్నింటికీ మించి ఈశ్వరన్ బినామీకి ఆంధ్రా నుంచి సొమ్ములు వెళ్లాయంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
ఈశ్వరన్ సీనియర్ మోస్ట్ లీడర్. సింగపూర్ మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. రవాణా శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆదేశానికి భారీగా ఆర్థిక నష్టం చేకూర్చాయి. దీంతో మంత్రి ఈశ్వరన్‌ని విచారించేందుకు కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) అనుమతినివ్వాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన ప్రధాని లూంగ్ విచారణకు అనుమతినిచ్చారు. ఈ కేసులో నిందితులెవరైనా సరే ఖచ్చితంగా విచారణ జరిగి తీరుతుందని.. అప్పటి వరకూ ఈశ్వరన్ లాంగ్ లీవ్ తీసుకోవాలని ఆదేశించారు. ఈశ్వరన్ ను పక్కన పెట్టి తాత్కాలికంగా రవాణా మంత్రిగా వేరే వ్యక్తిని నియమించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈశ్వరన్ కు హోటళ్లు ఉన్నాయని ఆరోపణలున్నాయి. అవన్నీ తన బినామీ హుంగ్ బెంగ్ సెంగ్ పేరిట ఉన్నట్టు విచారణలో తేలింది. దీంతో ఆయన్న సైతం అక్కడ సీపీఐబీ అదుపులోకి తీసుకుంది. అయితే ఓ సాధారణ వ్యాపారిగా ఉన్న హుంగ్ బెంగ్ సెంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి నిధుల వరద పారిందని గుర్తించినట్టు సమాచారం. అందులో ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నగదు జమ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే అదంతా ఈశ్వరన్ సన్నిహితుడైన చంద్రబాబు నుంచే అన్నట్టు వైసీపీ ప్రచారం చేస్తోంది.అమరావతి నిర్మాణ సమయంలో ఈశ్వరన్ పాత్రను గుర్తుచేస్తూ చంద్రబాబు నుంచి నగదు వెళ్లినట్టు వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మంత్రి ఆర్కే రోజా ఒక అడుగు ముందుకేసి త్వరలో చంద్రబాబును సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంలో సింగపూర్ ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడించడం లేదు. కానీ వైసీపీ మాత్రం చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది.