https://oktelugu.com/

సంక్షేమ పథకాల అమలుకే బయోమెట్రిక్ విధానమా?

ఆంధ్రప్రదేశ్ లో పని చేసే ఉద్యోగుల్లో1.30 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల విధి నిర్వహణపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలులో వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయం తెలుస్తూనే ఉంది. దీంతో ప్రభుత్వం దిద్దుబాట చర్యలకు పూనుకుంది. వారి బద్దకానికి స్వస్తి చెప్పాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని సంకల్పించింది. దీంతో అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాలని చూసినా కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 30, 2021 / 01:53 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో పని చేసే ఉద్యోగుల్లో1.30 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల విధి నిర్వహణపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలులో వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయం తెలుస్తూనే ఉంది. దీంతో ప్రభుత్వం దిద్దుబాట చర్యలకు పూనుకుంది. వారి బద్దకానికి స్వస్తి చెప్పాలని భావిస్తోంది.

    ఇందులో భాగంగా బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని సంకల్పించింది. దీంతో అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాలని చూసినా కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా తగ్గడంతో రాష్ర్టవ్యాప్తంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

    ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులు రేపటి నుంచి బయోమెట్రిక్ విధానంలోనే హాజరు వేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులు కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో ఉండడం లేదని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది.

    బయోమెట్రిక్ విధానానికి ఏడాది క్రితమే శ్రీకారం చుట్టినా కరోనా వైరస్ నేపథ్యంలో అమలు కాకుండా పోయింది. దీంతో ఉద్యోగులు బయోమెట్రిక్ విధానాన్ని వాయిదా వేయాలని సూచించారు. ఎప్పటిలాగే రిజిస్టర్ లో హాజరు శాతం నమోదు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బయోమెట్రిక్ విధానానికే ప్రభుత్వం మొగ్గు చూపడంతో జులై 1 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా బయోమెట్రిక్ హాజరు చేయాల్సిన అవసరం ఏర్పడింది.