
తెలంగాణలో మరోసారి దళితులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. అందరికీ అందుతున్న పథకాలే ఎస్సీలకు అందుతున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఏ జాతి వల్ల పదవి దక్కిందో వారిని ఆగౌరవ పరచొద్దని పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలను మళ్లిస్తున్నారన్నారు.