BCCI Central Contracts 2025: బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. సోమవారం అధికారికంగా బీసీసీఐ ఈ వివరాలు వెల్లడించింది.. ఇక గత సీజన్లో బిసిసిఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్టులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చోటు కోల్పోయారు. అయితే ఈ సీజన్లో వారిద్దరిపై బిసిసిఐ పెద్దలు కరుణ చూపించారు. దీంతో వారిద్దరు సెంట్రల్ కాంట్రాక్టులో స్థానం దక్కించుకున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఆట తీరు చూపించాడు.
Also Read: చిన్నప్పుడు వాంఖడే లోకి రానిచ్చేవారు కాదు.. రోహిత్ భావోద్వేగం.. వీడియో వైరల్
ఫలితంగా అతడికి గ్రేడ్ – బీ కేటగిరిలో కాంట్రాక్టు లభించింది..ఇషాన్ కిషన్ కు గ్రేడ్ – సీ లో స్థానం లభించింది. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి గ్రేడ్ – సీ లో చోటు లభించింది.. మహమ్మద్ సిరాజ్ కు గ్రేడ్ – ఏ లో చోటు దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా కు A+ గ్రేడ్ లభించింది.. అంతర్జాతీయ టి20 లకు రోహిత్, విరాట్, రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పారు. అయినప్పటికీ వారికి బిసిసిఐ పెద్దలు A+ గ్రేడ్ లో చోటు కల్పించడం విశేషం. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు మాత్రమే A+ కాంట్రాక్టు ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో.. అతని కాంట్రాక్ట్ రెన్యువల్ కాలేదు. ఇక తెలుగు ఆటగాడు కేఎస్ భరత్, జితేష్ శర్మ కాంట్రాక్టులో చోటు దక్కించుకోలేకపోయారు.. తాము నిర్దేశించిన సమయంలో ఆటగాళ్లు మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా 10 టి20 లు ఆడితే ఆటగాళ్లకు గ్రేడ్ – సీ కాంట్రాక్టు లభిస్తుందని గత ఏడాది బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.
వార్షిక వేతనాలు ఎలా ఉంటాయంటే
గ్రేడ్ A+ ఆటగాళ్లకు ఏడాదికి 7 కోట్లు వార్షిక వేతనం లభిస్తుంది. గ్రేడ్ – ఏ ఆటగాళ్లకు ఐదు కోట్లు దక్కుతుంది. గ్రేడ్ – బీ ఆటగాళ్లకు మూడు కోట్లు, గ్రేడ్ సి ఆటగాళ్లకు కోటి రూపాయలు వార్షిక వేతనంగా లభిస్తుంది.
గ్రేడ్ A+: రవీంద్ర జడేజా, బుమ్రా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ.
గ్రేడ్ ఏ: కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, గిల్.
గ్రేడ్ బీ: కులదీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్,
గ్రేడ్ సీ: వరుణ్ చక్రవర్తి, ఆకాష్ దీప్, హర్షిత్ రానా, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ధ్రువ్ జూరెల్, అర్ష్ దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రింకూ సింగ్, రుతు రాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, శివం దుబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్.
Also Read: 14 ఏళ్ల సూర్యవంశీ.. ఐపీఎల్ కోసం ఇంత త్యాగం చేస్తున్నాడా? చప్పట్లు కొట్టాల్సిందే..