Homeఆంధ్రప్రదేశ్‌YSR Congrss Party :  చేతులు కాలాక ఆకులు పట్టుకున్న వైఎస్ జగన్.. ఇప్పుడు చేస్తే...

YSR Congrss Party :  చేతులు కాలాక ఆకులు పట్టుకున్న వైఎస్ జగన్.. ఇప్పుడు చేస్తే ఏం లాభం?

YSR Congrss Party : ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురయ్యింది. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి తేరుకుంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇటువంటి తరుణంలో పార్టీ అధినేత జగన్ సమూల ప్రక్షాళనకు దిగాలని భావిస్తున్నారు. క్రమేపి పార్టీలో మార్పులు ఇస్తున్నారు. కీలక నియామకాలు చేస్తున్నారు. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా కొన్ని నియామకాలు చేపట్టారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితం అయింది. ఊహించని పరాజయంతో పార్టీ శ్రేణులు నిరాశతో ఉన్నాయి. కొందరు నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీనియర్లు సైతం మౌనం వీడడం లేదు. కొందరు పార్టీలో సైతం యాక్టివ్ గా లేరు. దీంతో వారి స్థానంలో కొత్త వారి నియామకం తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల్లో జగన్ పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టడం విశేషం. వివాదాస్పద నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను సైతం మార్చుతానని జగన్ స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. జగన్ వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. అటు నుంచి వచ్చిన వెంటనే పార్టీ ప్రక్షాళనకు సిద్ధపడతారు. అందులో భాగంగా తాజాగా కొన్ని నియామకాలను చేపట్టారు.

*:ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురు
పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని కొత్తగా నియమించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిప్రధాన కార్యదర్శులుగా నిర్మించారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యలను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

* వారి స్థానంలో కొత్త వారికి
వివిధ కారణాలతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆళ్ల నాని ఉండేవారు. ఇటీవలే ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దూలం నాగేశ్వరరావు నియమించారు. టెక్కలి ఇన్చార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ఉండేవారు. ఆయన కుటుంబ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన మార్పు అనివార్యంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో టెక్కలి ఇన్చార్జిగా పేరాడ తిలక్ ను నియమించారు.

* మార్పును కోరుతున్న నేతలు
రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో దాదాపు 80 చోట్ల జగన్ అభ్యర్థులను మార్చారు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు.అందుకే నేతలు తమ పాత నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పటికే కొందరి పేర్లు మార్పు చేశారు. క్రమేపి వారి జాబితాలను ప్రకటిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే జగన్ పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీజినల్ ఇన్చార్జిలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జగన్ పార్టీలో ప్రక్షాళనకు దిగినట్టే. పార్టీలో ఉన్న వారితో రాజకీయం చేస్తానని.. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇస్తానని జగన్ సన్నిహితులు వద్ద చెబుతున్నారు. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular