https://oktelugu.com/

YCP: వైసీపీ నెక్స్ట్ వికెట్ ఆ జిల్లా నుంచే.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు వైఎస్సార్ కుటుంబ ఆస్తి వివాదం నడుస్తుండగా.. మరోవైపు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 28, 2024 / 06:00 PM IST

    YCP

    Follow us on

    YCP: ఏపీలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇందులో జగన్ కు అత్యంత సన్నిహితులు ఉండడం విశేషం. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీలో ఉండలేక చాలామంది బయటకు వెళ్తున్నారు. కొందరు టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తుండగా.. మరికొందరు జనసేన బాట పడుతున్నారు. అయితే పదవులు ఉన్నవారు సైతం వదులుకొని మరి క్యూ కడుతుండడం విశేషం. రాజ్యసభ సభ్యులు ముగ్గురితో పాటు మరో నలుగురు ఎమ్మెల్సీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. పదవులు వదులుకున్నారు. మూడు రోజుల కిందట మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గుడ్ బై చెప్పారు పార్టీకి. ఆమె బాటలోనే పలువురు మహిళా నేతలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా జగన్ కు సన్నిహిత నేత ఒకరు పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు టిడిపి నుంచి పెద్ద హామీ ఉన్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే పార్టీని వీడారు. జనసేనలో చేరిపోయారు. త్వరలో ఆయనకు జనసేనలో కీలక బాధ్యతలు ఇస్తారని ప్రచారం సాగుతోంది. కాగా వైసీపీ జిల్లా కొత్త అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించారు జగన్. ఇంకోవైపు అదే జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన నెల్లూరు ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సన్నిహితుడు. ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నప్పుడే మహిధర్ రెడ్డి సైతం అనుసరిస్తారని టాక్ నడిచింది.కానీ మహిధర్ రెడ్డి మాత్రం వైసీపీలోనే కొనసాగేందుకు అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా అదే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలుగజేసుకోవడంతో టిడిపిలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    * సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
    కందుకూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు మహీధర్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మహిధర్ రెడ్డిని తప్పించి.. బుర్ర మధుసూదన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు జగన్. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు మహీధర్ రెడ్డి. ఎన్నికల సమయంలో అసంతృప్తితో రగిలిపోయారు. కానీ ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గెలిచారు. ఎన్నికల ఫలితాల అనంతరం మహీధర్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు.

    *దసరా నుంచే ప్రచారం
    దసరా వేడుకలకు సంబంధించిన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జగన్ ఫోటో లేదు. మహీధర్ రెడ్డి కార్యాలయంలో సైతం జగన్ ఫోటోలను తొలగించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఎప్పటికీ టిడిపి ముఖ్యులు చంద్రబాబు నుంచి మహీధర్ రెడ్డికి ప్రాధాన్యత విషయంలో కీలక హామీ తీసుకున్నట్లు సమాచారం. అయితే పార్టీని వీడుతారని సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు మహీధర్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మహిధర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.