Pawan Kalyan: తమిళనాడులో విజయ్ పార్టీపై పవన్ సంచలన పోస్ట్!

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు పవన్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు పవన్ మాదిరిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు తమిళ స్టార్ విజయ్ దళపతి.

Written By: Dharma, Updated On : October 28, 2024 6:10 pm

Pawan Kalyan(28)

Follow us on

Pawan Kalyan: తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఆవిష్కృతం అయ్యింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. అశేష జనవాహిని నడుమతొలి సభను ఏర్పాటు చేశారు. సభ విజయవంతం కావడంతో తమిళనాడులో విజయ్ పార్టీ పై బలమైన చర్చ నడుస్తోంది. జాతీయ స్థాయిలో సైతం విజయ్ చర్చకు దారి తీశారు. విజయ్ తమిళ వెట్రి కళగం పార్టీని ఏర్పాటు చేశారు. తన రాజకీయ పంధాను ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అధికార డిఎంకెను తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తామని కూడా తేల్చి చెప్పారు. అటు బిజెపితో సిద్ధాంత పరంగా విభేదిస్తామని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని సంకేతాలు ఇచ్చారు. పొత్తులకు సైతం సిద్ధమని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఇటీవల తమిళ అంశాలలో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలో విజయ్ దళపతి కొత్త పార్టీ ఏర్పాటు పై పవన్ స్పందించారు.పవన్ సైతం సినీ రంగం నుంచి వచ్చి పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం పార్టీని నడిపి అధికారంలోకి రాగలిగారు. పవన్ మాదిరిగా దళపతి విజయ్ సైతం అలానే రాణిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* పోస్ట్ పెట్టిన పవన్
విజయ్ కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయ్ రాజకీయ ప్రస్థానంపై సంచలన పోస్ట్ పెట్టారు. తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టడాన్ని సాదరంగా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. హర్షం కూడా వ్యక్తం చేశారు. హీరో విజయ్ కు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సాధు సొంత ఊరు ఉన్న తమిళనాడులో పొలిటికల్ జర్నీ ప్రారంభించిన విజయ్కు విషెస్ తెలియజేశారు.

* అభిమానుల కోరిక అదే
పవన్ కళ్యాణ్ మాదిరిగా విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ పోలికలు విజయ్ లో సైతం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. విజయ్ సైతం సక్సెస్ అవుతారని ఆకాంక్షిస్తున్నారు. అయితే డిఎంకె కు చెందిన ఉదయ నిధి స్టాలిన్ పై పవన్ విమర్శించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తమిళనాడుకు చెందిన ప్రకాష్ రాజ్ పవన్ వైఖరిని తప్పు పట్టారు. ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ నేరుగా విజయ్ దళపతికి శుభాకాంక్షలు తెలపడంతో ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.