Mahesh Babu : సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రతి విషయాన్ని ఆమె షేర్ చేస్తుంది. సితార డాన్స్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. సితారకు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్ కూతురిగానే కాకుండా ఆమె సపరేట్ ఇమేజ్ మైంటైన్ చేస్తుంది. సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సితార లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య ఓ అంతర్జాతీయ జ్యూవెలరీ బ్రాండ్ కి సితార అంబాసిడర్ గా వ్యవహరించింది. అందుకు గాను సితార కోటి రూపాయలు తీసుకున్నట్లు వినికిడి.
ఆ కోటి రూపాయలను సితార సామాజిక సేవకు ఉపయోగించిందట. అనాథ బాలికలకు సితార గతంలో సైకిల్స్ పంపిణీ చేసింది. సామాజిక సేవలో సితార తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. 12 ఏళ్ల సితార సెలబ్రిటీ హోదా అనుభవిస్తుంది. పలు కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆమె ఒక ఈవెంట్లో పాల్గొంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
ఓ పాప సితారను ఏం చదువుతున్నావని అడిగింది. అందుకు సితార 6వ తరగతి పూర్తి చేశాను. తర్వాత 7వ తరగతికి వెళతానని చెప్పింది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు టాప్ సీక్రెట్ లీక్ చేసింది సితార. ఇటీవల మహేష్ బాబు ఓ పెళ్లికి హాజరయ్యాడు. బంధువుల వివాహం కావడంతో మహేష్ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. మహేష్ బాబు అక్క మంజుల సైతం ఈ పెళ్ళికి వచ్చింది. మహేష్ బాబు లాంగ్ హెయిర్ పెంచిన నేపథ్యంలో ఆమె మహేష్ జట్టును పట్టుకుని ఆట పట్టించింది.
ఈ వీడియో వైరల్ అయ్యింది. సదరు వీడియో చూపిస్తూ సీతారను వివరణ అడగ్గా… ఆసక్తికర సమాధానం చెప్పింది. అవును నాన్నకు తన జుట్టును వేరొకరు టచ్ చేస్తే నచ్చదు. ఆయనకు కోపం వస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాను అని సితార చెప్పుకొచ్చింది. సితార కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎస్ఎస్ఎంబి 29 కోసం మహేష్ బాబు జుట్టును పెంచిన సంగతి తెలిసిందే.