Homeఆంధ్రప్రదేశ్‌AP CM Jagan : సాహో ‘జగనే’శ్వర.. సాగిలపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ లు

AP CM Jagan : సాహో ‘జగనే’శ్వర.. సాగిలపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ లు

AP CM Jagan : వైసీపీలో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యూ కడుతున్నారు. గత ఎన్నికల ముందు ఇదే మాదిరిగా చాలామంది అధికారులు వైసీపీకి సేవలు అందించారు. పార్టీ అధికారంలోకి రావడంతో వారికి ఉన్నత కొలువులు దక్కాయి. మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సలహాదారుడి పదవిలో ఉన్నారు. ఆయన బాటలోనే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఉన్నారు. జనంలోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు చెందిన వలవన్ ఆగస్టు నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవిలో ఉన్నారు. పది రోజుల కిందటే ఆయన నియమితులయ్యారు. దీని వెనక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లు సమాచారం.

కరికుల వలవన్ తిరుపతి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ ప్రస్థానానికి అనువుగా ఉండేలా టీటీడీ బోర్డులో ఎక్స్ ఆఫీషియో సభ్యుడుగా కొనసాగేలా దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి దక్కించుకున్నారని సమాచారం.

ఆగస్టు నెలాఖరులో కరికుల వలవన్ పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఇప్పుడున్న పోస్ట్ లోనే ఏడాది పాటు కొనసాగేలా జగన్ సర్కార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ఉంటూ తిరుపతిలో రాజకీయ అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశం దొరికింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version