https://oktelugu.com/

BRo Collections : రెండో రోజు తగ్గని ‘బ్రో’ జోరు… నైజాంలో కుమ్మేశాడు! ఎన్ని కలెక్షన్లంటే?

ఏపీ&తెలంగాణాలో రెండో రోజు రూ. 12 నుండి 13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఒక వరల్డ్ వైడ్ చూస్తే రూ.14 నుండి 15 కోట్లు రాబట్టింది. బ్రో మూవీ వరల్డ్ వైడ్ షేర్ రూ. 60 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్రో మూవీ ఈ సండే భారీగా వసూళ్లు రాబట్టాలి. అప్పుడు మాత్రమే డేంజర్ జోన్ నుండి బయటపడుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2023 / 11:22 AM IST

    Pawan Kalyan Bro Movie

    Follow us on

    BRo Collections : పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు బ్రో రూ. 33.5 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 46 కోట్ల షేర్ వరకూ రాబట్టింది. అయితే సెకండ్ డే బ్రో నెమ్మదించినట్లు తెలుస్తోంది. నైజాంలో మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. శనివారం బ్రో నైజాంలో రూ. 4.78 కోట్ల షేర్ అందుకుంది. రెండు రోజులకు గానూ నైజాంలో బ్రో మూవీ రూ. 13 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఆంధ్రా, సీడెడ్ లో డ్రాప్ కనిపించింది.

    ఏపీ&తెలంగాణాలో రెండో రోజు రూ. 12 నుండి 13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఒక వరల్డ్ వైడ్ చూస్తే రూ.14 నుండి 15 కోట్లు రాబట్టింది. బ్రో మూవీ వరల్డ్ వైడ్ షేర్ రూ. 60 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్రో మూవీ ఈ సండే భారీగా వసూళ్లు రాబట్టాలి. అప్పుడు మాత్రమే డేంజర్ జోన్ నుండి బయటపడుతుంది.

    బ్రో వరల్డ్ వైడ్ రూ. 97 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 99 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కాబట్టి బ్రో సాగించాల్సిన జర్నీ చాలా ఉంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బ్రో రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశం కలదు. చెప్పాలంటే పవన్ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రధాన హీరో కాకపోయినా ఈ స్థాయి వసూళ్లు ఆయన ఫేమ్, క్రేజ్ కిన్ నిదర్శనం.

    బ్రో తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కింది. అప్పట్లో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆల్రెడీ చేసిన గోపాల గోపాల చిత్రాన్ని పోలి ఉంటుంది, వద్దన్నారు. అయితే పవన్ ఇమేజ్ ఆధారంగా కీలక మార్పులు చేశారు. మూల కథలో భారీగా మార్పులు చేశారు. త్రివిక్రమ్ మాటలు, కథనం అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించారు. సముద్ర ఖని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటించారు.