PK Team : పార్టీలోనూ.. పాలనలోనూ ఐ ప్యాక్ హవా.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నిట్టూర్పు

అంతా నడిపించేంది పీకే టీమ్ అనేది జగమెరిగిన సత్యం. ప్రశాంత్ కిశోర్ బిహార్ రాజకీయాల్లోకి వెళ్లినా. ఆయన ఐ ప్యాక్ టీమ్ వైసీపీ సర్కారును తన చిటికెన వేలితో ఆడిస్తుందన్న టాక్ బహుళ ప్రాచుర్యంలో ఉంది.

Written By: Dharma, Updated On : July 6, 2023 10:04 am
Follow us on

PK Team : ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నిమిత్తమాత్రులు. ఒక్క మాటలో చెప్పాలంటే పానకంలో పుడకలు లాంటి వారు అని ఒక టాక్ నడుస్తోంది. అంతా నడిపించేంది పీకే టీమ్ అనేది జగమెరిగిన సత్యం. ప్రశాంత్ కిశోర్ బిహార్ రాజకీయాల్లోకి వెళ్లినా. ఆయన ఐ ప్యాక్ టీమ్ వైసీపీ సర్కారును తన చిటికెన వేలితో ఆడిస్తుందన్న టాక్ బహుళ ప్రాచుర్యంలో ఉంది. సాక్షాత్ వైసీపీ నేతల ఈ విషయంలో తమ సమ్మతిని తెలియజేస్తారు. తాము ఆటబొమ్మలమే కానీ ఆడించేది వారేనంటూ నిట్టూర్చి చెబుతుంటారు. చివరకు జగన్ భక్తులది సైతం ఇదే అభిప్రాయం. అయితే ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు, మంత్రుల గుణగణాలను చూసిన ఈ బృందం పాలనలోనూ చేయి పెడుతుండడం విశేషం.

గత నాలుగేళ్లుగా వైసీపీ సర్కారు సంక్షేమంతో నెట్టుకొచ్చింది. ఎక్కడా పిడికెడు మట్టి తీయలేదు. రహదారులు నిర్మించలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకతకు ఇదే ప్రధాన కారణం. అటు ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తుంది మౌలిక వసతులపైనే. అటు గడపగడపకూ పలుకరించేందుకు వెళుతున్నవారికి నిలదీతలు ఎదురవుతున్నది సమస్యలపైనే. కానీ సీఎం జగన్ తాను బటన్ నొక్కుతున్నానని.. మీరు ప్రజల వద్దకు వెళ్లి మద్దతు కూడగట్టండని ఆదేశాలిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళుతుంటే నిలదీతలు తప్పడం లేదు. అందుకే పార్టీ వర్క్ షాపుల్లో తమ పరిస్థితిని ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకరవు పెడుతున్నారు. దీంతో ఎన్నికల చివరి ఏడాది కావడంతో మౌలిక వసతులపై ప్రభుత్వం కాస్తా దృష్టిపెట్టింది.

అయితే ఇక్కడ కూడా వైసీపీ ప్రజాప్రతినిధులకు షాక్ తగులుతోంది. మా నియోజకవర్గంలో వేయవలసి రోడ్లు ఇవి.. చేపట్టాల్సిన నిర్మాణాలివి అని చెబుతుంటే అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. అల్ రెడీ తమకు ఒక జాబితా వచ్చిందని చెబుతుండడంతో షాక్ తింటున్నారు. ప్రజా వ్యతిరేకత అధికంగా ఉండే ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టాలని ఐ ప్యాక్ ఆదేశాలిస్తోంది. వారిచ్చిన జాబితాల ప్రాప్తికే ప్రభుత్వం నిధుల మంజూరు చేస్తోంది. తాము ప్రతిపాదించినవి కనీస పరిగణలోకి తీసుకోకపోవడంతో వైసీపీప్రజాప్రతినిధులు నొచ్చుకుంటున్నారు.