Seema Dasara Chinnodu: జనంలో నుంచి పుట్టిందే జానపదం… పల్లె ప్రజల గుండెల లోతులను ఆవిష్కరించే పాట జానపదం.. శ్రమను మర్చిపోయేలా చేసేది జానపదం.. పనుల్లో ఆలసట లేకుండా చేసేది పల్లె పదం.. తెలంగాణ పల్లె పదాలకు అత్యంత ఆదరణ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ జానపదానికి ఆదరణ తగ్గినా.. గుర్తింపు లేకపోయినా.. అదే జానపదం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. సకల జనులను ఐక్యం చేసింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత జాన పదాలతో యువత సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. రీల్స్ చేయడంతోపాటు తమలోని క్రియేటివిటీని వెలికి తీస్తున్నారు. తాజాగా ఓ చైనా డ్యాన్స్‌ను తెలంగాణ ఫోక్ సాంగ్ జోడించి తీసిన పాటకు సోషల్ మీడియా బ్రహ్మరథం పడుతోంది.
సీమ దసర చిన్నోడు..
కేమెరవట్టిన్నడే సీమ దసర చిన్నోడు.. నా ఫోటో తీస్తున్నడే సీమ దసర చిన్నోడు.. ఈ పదాలతో మొదలయ్యే పాట చైనా డ్యాన్స్ నుంచే పుట్టింది. చైనావోడి పాటకు చైనీయులు చేస్తున్న స్టెప్స్‌ను తెలంగాణ ఫోక్ రైటర్ జాన పదాన్ని జోడించి తెరకెక్కించిన పాట ఇప్పుడు సోషల్ మీడియను ఉర్రూతలూగిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ ఫోక్‌సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి చైనా ఒరిజినల్ సాంగ్ డ్యాన్స్.. తెలుగు జానపద డ్యాన్స్‌ను జోడించి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అంతా చైనా డ్యాన్స్ కంటే తెలంగాణ డ్యాన్స్ సూపర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
2 లక్షలకుపైగా వ్యూస్..
హరీశ్ పటేల్ రాసిన ఈ ఫోక్ సాంగ్‌ను స్వాతి పటేల్ మెండు ప్రొడ్యూస్ చేశారు. ఈ పాటను ఉషక్క, నిఖిత ఆలపించారు. డీజే.శేఖర్ సంగీతం అందించారు. కొరియోగ్రఫీ శేఖర్ పనిచేశాడు. గ్రామీణ ప్రాంతంలో తీసని ఈ జానపదం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. వాడుక భాషలో.. రోజు వాడే పదాలే ఇందులో ఉన్నాయి. ఈ పాటలో వర్షిణి, రమ్యశ్రీ చేసిన డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. జూన్ 19న విడుదలైన ఈ పాటకు ఇప్పటికే 21 కే వ్యూస్ వచ్చాయి. 60 కే లైక్స్ వచ్చాయి. ఇందులో చైనావాడి పాటను రీమేక్ చేసి.. తెలంగాణ ఫోక్‌తో లక్షల వ్యూస్ సాధించడమే ఈ పాట హైలెట్.