Hyper Aadi : హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్.. ఓ వివాదం

అన్న మంచోడైతే ఇద్దరు భార్యలను వదులుకుంటాడా? వెళ్లి జబర్దస్త్ చేసుకోరా బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మీ అన్న వల్ల అన్యాయం జరిగిందని ముగ్గురు మహిళలు తిరుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెబుతావు బ్రో అంటూ ఎక్కువమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఆది చేసిన విమర్శ.. అదే స్థాయిలో తిప్పికొడుతుండడం విశేషం.

Written By: NARESH, Updated On : April 23, 2024 11:13 am
Follow us on

Hyper Aadi : బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నారు హైపర్ ఆది. జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు పొందారు. అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. కాంటెస్ట్ గా వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే టీం లీడర్ గా ఎదిగారు. తన స్కిట్లను తానే రాసుకుని అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. హైపర్ ని ఇంటిపేరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోలో సందడి చేస్తున్నారు. అయితే తన స్కిట్లలో మహిళలను కించపరుస్తుంటారన్న కామెంట్స్ హైపర్ ఆది పై ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్ తో ఒక్కోసారి విమర్శలకు సైతం గురవుతుంటారు ఆది.అయితే ఆది మెగా కుటుంబ అభిమాని. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అవకాశం ఉన్నప్పుడు పవన్ పై అభిమానం చూపిస్తుంటారు.

అయితే కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగాను పవన్ చర్యలను ఆది అభిమానిస్తుంటారు. పవన్ పై ఈగ వాలనివ్వరు. ఇది చాలా సందర్భాల్లో వెలుగు చూసింది. ఎవరైనా విమర్శలు చేస్తే తన పంచ్ డైలాగులతోప్రతి విమర్శలు చేస్తారు. అందుకే తాజా ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ల జాబితాలో జనసేన హైపర్ ఆది కి చోటిచ్చింది. ప్రస్తుతం ఆయన షూటింగులకు విరామం ఇచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆది చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. సీఎం జగన్ ను ఉద్దేశించి ఆది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోనే న్యాయం చేయలేనోడు.. మీ ఇంట్లో ఎలా న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. షర్మిల, సునీతలు జగన్కు ఓటు వేయొద్దని ప్రజలు కోరుతున్నారనే విషయాన్ని హైపర్ ఆది గుర్తు చేశారు. ఇప్పుడు ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ భార్యలను గురించి ప్రస్తావిస్తూ.. పెళ్ళాలను వదిలేసినోడు ప్రజలకు ఏం చేస్తాడు రా డైపర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ముందుగా మీ అన్న ఇంట్లో మంచి వాళ్ళు ఉన్నారా? అని ప్రశ్నించారు. అన్న మంచోడైతే ఇద్దరు భార్యలను వదులుకుంటాడా? వెళ్లి జబర్దస్త్ చేసుకోరా బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మీ అన్న వల్ల అన్యాయం జరిగిందని ముగ్గురు మహిళలు తిరుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెబుతావు బ్రో అంటూ ఎక్కువమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఆది చేసిన విమర్శ.. అదే స్థాయిలో తిప్పికొడుతుండడం విశేషం.