Chandrababu: ప్రస్తుతం దేశం లో ప్రజలతో మమేకమై పరిపాలన చేస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. జనాలతో కలిసి భోజనం చేయడం , వాళ్ళతో కలిసి బస్సు ప్రయాణం చేస్తూ బాగోగులు అడిగి తెలుసుకోవడం , అర్జీలు స్వయంగా స్వీకరించి వారి సమస్యలకు పరిష్కారం చూపడం , ఇలా ఒక్కటా రెండా ఎన్నో సందర్భాలు ఆయన్ని జనాలకు అత్యంత చేరువ చేశాయి. గతంలో పని చేసిన కొంతమంది ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు పలు సందర్భాల్లో సహనం కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సహనం కోల్పోలేదు , ఎలాంటి పరిస్థితి వచ్చినా చాలా కూల్ గానే మాట్లాడేవారు. కానీ మొదటిసారి ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో , పిటీషన్ పట్టుకొని వచ్చిన ఒక మహిళపై మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
చంద్రబాబు లోని ఈ కోపాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు బనగానేపల్లె లో ‘మీ భూమి – మీ హక్కు’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఈ కార్యక్రమం లో ఒక మహిళా పిటీషన్ పట్టుకొచ్చి రచ్చ చేయడం తో ఆయన మండిపడ్డారు. ఆయన ఆ మహిళతో మాట్లాడుతూ ‘వినమ్మా.. విను.. కొత్తగా నేర్చుకున్నారు ఈమధ్య డ్రామాలు. ఆ పక్కన ఉండు , మీరు ఎవరైనా సరే మీరు అర్జీలు ఇవ్వాలంటే , ఆ పక్కనే వచ్చి తీసుకుంటాను , మర్యాదగా మాట్లాడుతాను, అంతే తప్ప మధ్యలో మాట్లాడితే మంచిది కాదు’ అంటూ మండిపడ్డారు. అంతే కాకుండా పోలీసులకు ‘వాళ్ళని అటు పక్కన నిల్చోబెట్టండి.. ఫోర్స్ గా తీసుకెళ్ళకండి’ అంటూ ఆదేశించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా కాగితం ఇవ్వాలంటే, ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడుతా, మీ చెప్పే సమస్యలన్నీ విని పరిష్కారం చేయిస్తా ‘ అంటూ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు ఇలా అర్జీలు పట్టుకొని వచ్చిన వారిపై అరవడాన్ని వైసీపీ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామని వస్తే, చంద్రబాబు వాళ్లపై ఎలా మండిపడుతున్నారో చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆ సభలో సీఎం చంద్రబాబు ఈ అర్జీల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి , వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కలెక్టర్ కి వివరించారని , దాని సంగతి చూపించకుండా , ఇలా సగం సగం వీడియోలు కట్ చేసి సీఎం పై విష ప్రచారం చేస్తున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.
