Praveen Pullata: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఏపీ ప్రజలు ఏకపక్ష విజయం అందించారు కూటమికి. అద్భుత విజయం సొంతం చేసుకుంది మూడు పార్టీల కూటమి. అయితే ఈ ఆరు నెలల కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయలేదని వైసిపి ఆరోపిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదని తప్పుపడుతోంది. ప్రజల్లో అసంతృప్తి ప్రారంభం అయిందని చెబుతోంది. ఈ తరుణంలో ఎన్నికల సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషణలు చేసిన ఎనలిస్ట్ ప్రవీణ్ పుల్లట.. తాజాగా తన ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఆయన చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకపక్షంగా మద్దతు తెలిపిన ఈ ప్రభుత్వం పట్ల.. ఏ వర్గం ఎందుకు సంతోషంగా లేదని ప్రశ్నించారు. ప్రజలు మితిమీరిన విధంగా ఆశిస్తున్నారా? లేదా ప్రభుత్వం బలహీనంగా ఉందా? అన్న సందేహాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ఇదే ప్రవీణ్ పుల్లట ఏపీలో టిడిపి కూటమి ఘన విజయం సాధించబోతోందని చాలా ముందుగానే చెప్పారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు కూటమి ఆరు నెలల ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించారు.
* ఈ కారణాలతోనే
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయాల్లో చాలా వరకు జాప్యం జరిగిందని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలసత్వం, అధికారుల బదిలీలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని ప్రవీణ్ గుర్తు చేశారు. చంద్రబాబు మీరేనా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు ప్రవీణ్. ప్రస్తుతం ప్రవీణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* టిడిపికి అనుకూలమైన వ్యక్తిగా
వాస్తవానికి ప్రవీణ్ పుల్లట టిడిపికి అనుకూలంగా విశ్లేషణలు చేస్తారని.. సర్వేలు చేస్తారని ఒక విమర్శ అయితే ఉంది. వైసిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఆయన విశ్లేషణలు అలానే ఉండేవి. దీనిపై వైసీపీ నుంచి ఆయన చాలా రకాల విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే అదే ప్రవీణ్ పుల్లట ఇప్పుడు కూటమి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అయితే దీనిపై టిడిపి శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.
ఇంతటి భారీ విజయం దక్కిన తర్వాత ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు..ఎందుకని?
ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారా? లేదా పైవారు బలహీనంగా ఉన్నట్లా?సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలాగే అధికారుల బదిలీలలో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.. బాబూ..మీరేనా…
— Praveen Pullata (@praveenpullata) December 18, 2024