Rajamouli : నేషనల్ లెవెల్ లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో మన తెలుగు సినీ పరిశ్రమకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన దర్శకుడు రాజమౌళి. కేవలం కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్ ని చూసి విసుగెత్తిపోయిన ఆడియన్స్ కి మగధీర లాంటి హిస్టారికల్ మూవీ ని తీసి ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టి తొలిసారి పక్క రాష్ట్రానికి చెందిన వాళ్ళు మన టాలీవుడ్ వైపు చూసేలా చేసాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ తో నేషనల్ లెవెల్ లో జెండా పాతిన రాజమౌళి, ఆ తర్వాత #RRR చిత్రం తో మన తెలుగు సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్లి అంతర్జాతీయ గుర్తింపు ని తెచ్చిపెట్టాడు. సూపర్ స్టార్స్ ని మించిన సూపర్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న రాజమౌళి లాంటి దర్శకుడితో పని చెయ్యాలని ఎవరికి మాత్రం ఉండదు మీరే చెప్పండి?, అలాంటిది ఒక స్టార్ హీరోయిన్ రాజమౌళి సినిమాలో నటించేందుకు ససేమీరా నో చెప్పిందట.
ఆమె మరెవరో కాదు త్రిష. ఈమెకి రీసెంట్ సమయంలో హిట్స్ వచ్చాయి కానీ, అంతకు ముందు ఈమె వరుస ఫ్లాప్స్ లో ఉండేది. స్టార్ హీరోలు ఈమెతో సినిమాలు చేసేందుకు అసలు ఆసక్తి చూపేవారు కాదు. అలాంటి పరిస్థితి లో ఉన్న సమయంలో ఈమెకి రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. కానీ సునీల్ లాంటి కమెడియన్ పక్కన తాను హీరోయిన్ గా చేయలేనని చెప్పిందట. ప్రొడక్షన్ టీం వాళ్ళు భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ చేస్తే, మూడు కోట్ల రూపాయిలు ఇస్తే చేస్తానని చెప్పిందట. ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి ప్రొడక్షన్ టీం కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఇక ఆ తర్వాత రాజమౌళి అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో నెట్టుకొస్తున్న సలోని ని హీరోయిన్ గా తీసుకున్నాడు.
ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా సునీల్ ని హీరోగా ఇండస్ట్రీ లో స్థిరపడేలా చేసింది. అంతే కాదు హీరోయిన్ గా చేసిన సలోని కి కూడా మంచి పేరొచ్చింది. వాస్తవానికి ఆ పాత్ర త్రిష కి అద్భుతంగా సూట్ అవుతుంది. అహం పక్కన పెట్టి ఆమె ఈ సినిమాని ఒప్పుకొని ఉండుంటే ఆమె కెరీర్ కి మంచి బూస్ట్ వచ్చేది. ఈ చిత్రం విడుదల తర్వాత త్రిష కి చాలా కాలం వరకు అవకాశాలు రాలేదు. ఏ చిన్న హీరో తో అయితే ఆమె చెయ్యనని చెప్పిందో, తమిళం లో ఆమెకి చిన్న హీరోల సినిమాలే దిక్కు అయ్యింది. కొంతకాలం వరకు ఆమె కెరీర్ అలాగే సాగింది. ఇటీవల కాలం లో కాస్త వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.