Hostel Food Controversy: ఏపీ హోం శాఖ మంత్రి అనిత నిన్న బీసీ హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. హాస్టల్ నిర్వాహకులు ఆమెకు ప్లేట్ ఇచ్చారు. భోజనం కూడా పెట్టారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా ఆమె చేతిలో ఒక వస్తువును పట్టుకొని చూపించారు. ఆమె ఆహారం తింటుండగా బొద్దింక వచ్చిందని.. మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక విద్యార్థుల గురించి చెప్పాల్సిన పనిలేదనట్టుగా వీడియో వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు ఏపీ హోం శాఖ మంత్రి విజిట్ లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో సహజంగానే మీడియా అత్యుత్సాహంగా ఈ వార్తను ప్రసారం చేసింది. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ మీడియా గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నిన్నటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో హోం మంత్రి భోజనం గురించే చర్చ..
Also Read: అనితమ్మ మీ కంచంలోనే బొద్దింక వస్తే.. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటో?
తమ ప్రభుత్వం వచ్చినాక విద్యా వ్యవస్థ బాగుపడిందని ఆ శాఖ మంత్రి లోకేష్ చెప్తున్నారు. అంతేకాదు విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూర్చుతున్నామని వెల్లడిస్తున్నారు. కానీ హోం శాఖ మంత్రి పర్యటనలో బొద్దింక రావడంతో లోకేష్ ఇన్నాళ్లుగా చెప్పిన మాటలకు విలువ లేకుండా పోయింది. ఇదే విషయాన్ని వైసిపి ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఇక తన మీడియాలో అయితే ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేస్తున్నది. ఇదంతా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ లాగా ఉండడంతో హోం మంత్రి అనిత స్పందించక తప్పలేదు. ఆమె వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. తాను భోజనం చేస్తుంటే వచ్చింది బొద్దింక కాదని.. వెంట్రుక అని నిరూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అనిత భోజనం చేస్తున్నప్పుడు వచ్చింది బొద్దింకనా? వెంట్రుకనా? అనేది పక్కన పెడితే.. నేటి సోషల్ మీడియా కాలంలో కావాల్సింది సంచలనం మాత్రమే. నిజం కాదు. సోషల్ మీడియాలో అబద్దాల వ్యాప్తి మాత్రమే అధికంగా ఉంటుంది. ఎంత సంచలనం అయితే దానికి అంత విలువ ఉంటుంది. అలాంటప్పుడు అనిత వెంట్రుకలు చూపించిన నమ్మే పరిస్థితిలో జనం ఉండరు. పైగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం. దీనివల్ల అబద్దమే నిజం అనే నమ్మే రోజులు చేశాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో కంచె గచ్చిబౌలి భూములను చదును చేస్తుంటే జింకలు, నెమళ్లు అరుపులు పెట్టాయని వీడియోలు ప్రసారమయ్యాయి. ఈ వీడియోలను భారత రాష్ట్ర సమితి నాయకులు తెగ ప్రచారం చేశారు. అయితే హైకోర్టు దాకా ఈ విషయం వెళ్లడం.. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిందని తేలింది. దీంతో అప్పటిదాకా ఆ వీడియోలను పెట్టిన వారంతా డిలీట్ చేయడం మొదలుపెట్టారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నది.
Also Read: వైఎస్.జగన్ బిగ్ స్టెప్.. ఇది గేమ్ చేంజర్ అవుతుందా?
ఇక నిన్న హాస్టల్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనిత కాస్త చాకచక్యంగా ప్రవర్తించి ఉంటే బాగుండేది. ఎక్కడ సందు దొరుకుతుందా అని వైసిపి ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ రివెంజ్ కోసం గట్టిగా ఎదురుచూస్తోంది. ఇక బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా కూడా వైసిపికి సపోర్ట్ చేస్తున్నది. అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా విభాగాలు ఇటీవల కాలంలో బలోపేతమయ్యాయి. అలాంటప్పుడు అధికారంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. అవకాశం ఇస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. అప్పుడు ఎలాంటి వివరణలు ఇచ్చినా పెద్దగా ఉపయోగ ఉండదు. ఎందుకంటే జనాలు కావాల్సింది సంచలనాలు మాత్రమే.. నిజాలు కావు. నిజాలు చెప్పినా నేటి కాలంలో వినిపించుకునే పరిస్థితులు లేవు.
అది బొద్దింక కాదు వెంట్రుక
డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన అనిత
పాయకరావుపేట బీసీ హాస్టల్లో తిన్న భోజనంలో బొద్దింక వచ్చిన విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా అది బొద్దింక కాదు వెంట్రుక అంటూ బుకాయింపు https://t.co/2TIrqPVwxS pic.twitter.com/qSA3FzyQ9v
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2025