Hostel Hygiene Issue: మనం భోజనం చేస్తుంటే అనుకోకుండా ఏదైనా రాయో.. ఇంకోటో వస్తే చాలా ఇబ్బంది పడతాం. ఆ సమయంలో కష్టమైనా సరే భోజనాన్ని పక్కన పెడతాం . ఎందుకంటే ఒక మనిషికి భోజనం అత్యంత ముఖ్యమైనది. ఎన్ని కష్టాలు పడినా సరే సంతృప్తిగా భోజనం చేయడానికే.. అలాంటి భోజనంలో ఏదైనా క్రిమి కనిపిస్తే.. కీటకం లాంటిది చనిపోయినట్టు అనిపిస్తే ఇంకేమైనా ఉందా.. ఇలాంటి అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితకు ఎదురయింది..
బీసీ హాస్టల్ ను సందర్శించడానికి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మంగళవారం వెళ్లారు. అక్కడ వసతి పొందుతున్న బాలికలతో మాట్లాడారు. వారికి ప్రభుత్వం తరఫున లభిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడి బాలికలతో కాసేపు మాట్లాడారు. ఈలోపు మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో.. ఆమె అక్కడ పిల్లలతో కలిసి కూర్చున్నారు. విద్యార్థులతో మాదిరిగానే భోజనం చేయడానికి ఆమె రెడీ అయ్యారు. ఈ లోగానే అక్కడి హాస్టల్ నిర్వాహకులు భోజనం పెట్టారు. భోజనం తినడానికి అనిత రెడీ అవుతుండగా ఆమె ప్లేట్లో బొద్దిగా కనిపించింది. దీంతో వెంటనే ఆమె సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయకుండానే.. తన చేతికి దొరికిన బొద్దింకను చూపిస్తూ.. నేను తింటున్న ప్లేట్లోనే ఇలా బొద్దింక కనిపించింది.. ఇక విద్యార్థుల సంగతి ఏమిటని అనిత ప్రశ్నించారు.
Also Read: CM Chandrababu: 12 నెలలు.. 12 ప్రాంతాలు.. 70 ఏళ్ల వయసులో ‘బాబు’ చేసిన పని వైరల్
అనిత చేతికి బొద్దింక దొరికిన వీడియోను వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారిందని.. విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో విఫలమైందని విమర్శించడం మొదలుపెట్టాయి.. ఇక దీనికి కూటమి నాయకులు కూడా సరిగానే స్పందిస్తున్నారు. “బొద్దింక ఉందని మంత్రి అక్కడి నుంచి వెంటనే లేచి రాలేదు. అక్కడి నిర్వాహకులతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ పరిపాలన కాలంలో ఏనాడైనా ఇలా హాస్టళ్లను సందర్శించారా? విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారా? తప్పు జరిగిందని మంత్రి చెప్పారు. దాని పరిష్కారానికి చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. ఈ మాత్రం సోయి మీ ప్రభుత్వంలో ఉందా అంటూ” కూటమి నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.
పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. హాస్టల్ లో వార్డెన్ అందుబాటులో లేకపోవడం, భోజనం మెనూ సరిగా అమలు జరగకపోవడంపై సమగ్ర విచారణ చేసి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాను. విద్యార్థులతో కలిసి భోజనం చేసి.. హాస్టల్ లో పరిస్థితులను అడిగి తెలుసుకోవడం… pic.twitter.com/91aII0Zt6f
— Anitha Vangalapudi (@Anitha_TDP) June 30, 2025
ఇక ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని వసతి గృహాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. బొద్దింక ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. హోమ్ మంత్రి ఆకస్మికంగా వసతి గృహాన్ని సందర్శించడం వల్ల ఈ లోపాలు మొత్తం బయటికి కనిపించాయని.. రాష్ట్రంలో ఉన్న వసతి గృహాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు.
పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత..
హాస్టల్ లో మౌలిక వసతులు, భోజనం మెనూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం..
సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం#Payakraopeta #BcHostel #ChandrababuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha pic.twitter.com/OGFlQgKLYT— Anitha Vangalapudi (@Anitha_TDP) June 30, 2025