Hari Hara Veeramallu Trailer : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాన్ ఇండియన్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రేపు గ్రాండ్ గా రిలీజ్ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు కలిపి మొత్తం మీద 120 థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని అభిమానుల కోసం స్పెషల్ గా ప్రదర్శించబోతున్నారు. అయితే చాలా కాలం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా, అది కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా, అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి, అందుకే కొన్ని థియేటర్స్ యాజమాన్యాలు క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది.
విషయం లోకి వెళ్తే బెంగళూరు లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ ని నిన్నరాత్రి మొదలు పెట్టారు. బుకింగ్స్ ప్రారంభించిన 5 నిమిషాల లోపే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఒక్కో టికెట్ ని 11 రూపాయలకు విక్రయించారు. ఎందుకంటే అభిమానులు థియేటర్ లోపల అత్యుత్సాహం తో హంగామా చేస్తూ ఏదైనా డ్యామేజ్ చేస్తే, ఆ డ్యామేజ్ ఖర్చులు కవర్ చేయడానికి ఇలా చేశారు. 11 రూపాయిల టికెట్ రేట్ అయితే పెట్టారు కానీ, అన్ని రకాల చార్జీలతో కలిపి ఓవరాల్ గా 36 రూపాయిలు అయ్యింది. దీంతో కేవలం ఆ ఒక్క షో నుండే 28 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. డిమాండ్ వేరే లెవెల్ లో ఉండడం తో అదే థియేటర్ లో మరికొన్ని షోస్ యాడ్ చేసే ప్రయత్నం లో ఉన్నారు.
Also Read : దిల్ రాజు వల్ల రామ్ చరణ్ కి 200 కోట్లు నష్టం..బోనస్ గా నిందలు..ఇదెక్కడి న్యాయం!
అదే విధంగా బుక్ మై షో యాప్ లో మరికొన్ని థియేటర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నేడు ఏ క్షణం లో అయినా మొదలు పెట్టే అవకాశం ఉంది. బెంగళూరు లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్ ని అనుసరిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి నిర్మాతలు ఆ విధంగా ఆలోచన చేస్తారో లేదో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా బెంగళూరు మోడల్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి. లేకపోతే వచ్చే జనాలను కంట్రోల్ చెయ్యలేరు, కొన్ని చోట్ల అనర్ధాలు జరగొచ్చు అని అంటున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా ఓవర్ గా క్రౌడ్ ఉండే RTC క్రాస్ రోడ్స్ లాంటి సెంటర్స్ లో కేవలం ఒకే ఒక్క థియేటర్, ఒక్క షో ని మాత్రమే కేటాయించారు.