HJ Dora Tribute: మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోలేదు గాని.. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త. ఎందుకంటే ఒక మాజీ డిజిపి చనిపోతే.. తెలంగాణ డిజిపి కన్నీరు పెట్టాడు. హైదరాబాద్ కమిషనర్ బాధపడ్డాడు. సాధారణంగా పోలీసులంటే కఠినంగా ఉంటారు అంటారు. మాజీ డిజిపి హెచ్ జే దొర చనిపోయిన తర్వాత.. తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి మరో మాటకు తావు లేకుండా దొర ఉంటున్న నివాసం వద్దకు వెళ్లిపోయారు. ప్రోటోకాల్.. మిగతావన్నీ పక్కన పెట్టి అక్కడే ఉండిపోయారు. శివధర్ రెడ్డి ఇలా ప్రవర్తించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సజ్జనార్ కూడా తన ఇంట్లో మనిషి చనిపోయినంత తీరుగా బాధపడ్డాడు.
Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో
దొర చనిపోతే శివధర్ రెడ్డి కన్నీరు పెట్టడం.. సజ్జనార్ బాధపడటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.. ఎందుకంటే పోలీస్ శాఖలో దొర తీసుకొచ్చిన మార్పులు.. సంస్కరణలు మామూలువి కావు. అందువల్లే దొరను చంద్రబాబు అభిమానించేవారు. పోలీస్ శాఖను కేవలం నేరాల నియంత్రణ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మాత్రమే కాకుండా.. ప్రజలతో మమేకం కావాలని.. వారి నమ్మకాన్ని పొందాలని.. వ్యవస్థ ల మీద నమ్మకాన్ని పెంపొందించాలని.. అప్పుడే సరైన పరిపూర్ణత లభిస్తుందని దొర నమ్మేవారు. అందువల్లే పోలీస్ శాఖలో ప్రజా సంబంధాల వ్యవస్థను.. పిఆర్ఓ లను ఆయన నిర్మించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కార్యకలాపాలు విస్తృతంగా ఉన్న సమయంలో.. పోలీసులపై దారుణంగా నెగిటివ్ ప్రచారం జరిగేది. అయితే ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి సమర్థవంతమైన ఒక వ్యవస్థ కావాలని దొర భావించారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ తీసుకుంటున్న ప్రజాహిత విధానాలను ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకువెళ్లాలని దొర భావించారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలలో పాత్రికేయులుగా అనుభవం.. అర్హత ఉన్న వారిని పోలీసు శాఖలో పిఆర్వోలుగా నియమించారు. అదే కాదు ఆ వ్యవస్థను అత్యంత బలోపేతం చేశారు. అంతేకాదు మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ప్రజా సంబంధాల వ్యవస్థను బలోపేతం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు తప్పుదారి పట్టకుండా ఉండడానికి కళాబృందాలను దొర ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్.. ఉమ్మడి కరీంనగర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళాబృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవి.
2001లో నల్గొండ జిల్లా ఎస్పీగా శివధర్ రెడ్డి ఉన్నప్పుడు.. దొర డిజిపిగా ఉన్నారు. నాడు నల్గొండ జిల్లాలో నక్సలైట్ కార్యకలాపాలను నియంత్రించడానికి శివధర్ రెడ్డి అత్యంత దీటైన కళాబృందాలను ఏర్పాటు చేశారు. పీపుల్స్ వార్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శివధర్ రెడ్డి చేస్తున్న పనులు దొర దృష్టికి వచ్చాయి. దీంతో ఆయన శివధర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు, డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ గా జరిగే మీటింగ్లలో శివధర్ రెడ్డి గురించి పదే పదే ప్రస్తావించేవారు దొర. నల్గొండలో ఏర్పాటుచేసిన కళాబృందాలను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల వారు కూడా అదేవిధంగా పనిచేయాలని దొర పదేపదే సూచించేవారు. దొర పోలీస్ శాఖలో తీసుకువచ్చిన మార్పులను ఇప్పటికీ కేసు స్టడీలుగా చెబుతూనే ఉంటారు. నాడు దొర అవలంబించిన విధానాలను హైదరాబాద్ సిపి సజ్జనార్ అమలు చేస్తున్నారు. అందువల్లే దొర చనిపోయిన తర్వాత డిజిపి శివధర్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి కన్నీరు పెట్టారు. ఇక సజ్జనార్ అయితే ఇంట్లో మనిషి చనిపోయినంత బాధపడ్డారు. పోలీస్ శాఖలో ఎంతోమంది డిజిపిలు వస్తుంటారు.. ఎంతోమంది పోతుంటారు. కొంతమంది మాత్రమే ఆ పదవికి వన్నె తీసుకొస్తారు. అటువంటి వారిలో దొర అగ్రస్థానంలో ఉంటారు.
