Homeఆంధ్రప్రదేశ్‌Heat Waves: ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక!

Heat Waves: ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక!

Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌ గుజరాత్, మహారాష్ట్ర, కేరళ రాస్ట్రాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్‌ ఉందని హెచ్చరించింది.

ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రత..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సగటున నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, నల్లగొండ, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లో భానుడు దంచి కొడుతున్నాడు. దీంతో జనం వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు ఓపెన్‌ చేస్తున్నారు. శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.

ఐదు రోజులు బయటకు రావొద్దు..
ఇక రానున్న ఐదు రోజులు బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని, వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని తెలిపింది. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. వేడి గాలులు ఇళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. బయట పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. స్కూల్‌ పిల్లలకు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజులు మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version