Job News: ఉన్నత చదువులు చదివినా జాబ్ దొరకడం లేదు. దొరికినా తక్కువ జీతం. ఈ క్రమంలో స్వయం ఉపాధి(Employement) వెతుక్కుంటున్నారు. ఇక తక్కువ చదువు ఉన్నవారు కూలీలుగా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతలో వృత్తి నైపుణ్యం పెంచడానికి ఏపీఎస్‌ఎస్‌డీసీ(APSSDC) ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధే ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదో తరగతి మొదలు ఆ పైచదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ వందల మందికి ఉద్యోగావకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆధోనిచీటర్స్ కాలనీలో జనవరి 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నాలుగు ప్రముఖ కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి.
వీరు అర్హులు..
పదో తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా ప్రారంభం అవుతుంది. ఇందుకు సబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి కోరారు. ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి ఉద్యోగ అర్హతను బట్టి జీతం పది వేల రూపాయల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. సొంత జిల్లాలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏటా రూ.2.4 లక్షలు పొందవచ్చు. మేళాకు వచ్చే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హత పత్రాల జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకెళ్లాలి.
వివరాలకు..
ఇక జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని దీప్తి తెలిపారు. ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం Website Link: https://naipunyam.ap.gov.in/user®istration మరిన్ని వివరాలకు రాజశేఖర్(9177413642), నర్సప్ప (9985496587)ను సంప్రదించాలని తెలిపారు.