Jagan
Jagan: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. కనీసం ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. 151 స్థానాలతో ఉన్న వైసీపీని ప్రజలు 11 కు తగ్గించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది దారుణ పరాభవమే. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన వైసిపి నాయకత్వం ఇంకా అవే తప్పిదాలకు పాల్పడుతోంది. అదే సమయంలో పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్తున్నారు. పార్టీలో ఉన్నవారు సైలెంట్ అవుతున్నారు. సీనియర్లు పట్టకుండా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో అధినేత జగన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూటమి దూకుడుకు తగిన విధంగా ఆలోచనలు చేయాల్సి ఉంది. కానీ అధినేతలు ఆ పరిస్థితి కనిపించకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన నిరాశ అలుముకుంది. తాజాగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు పార్టీ శ్రేణులు.
* జగన్ హయాంలో బకాయిలు
రాజశేఖర్ రెడ్డి ( Y S Rajasekhara Reddy ) కి పేరు తెచ్చిన పథకాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి. నిరుపేద విద్యార్థులకు చదువు కోసం రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేశారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని కొనసాగించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సైతం అమలు చేసి చూపించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సైతం పథకాన్ని అమలు చేశారు. కానీ నిధుల విడుదలలో జాప్యం చేశారు. ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించ గలిగారు. మిగతా విషయంలో పెండింగ్ పెట్టారు. ఇప్పుడు వాటినే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఆందోళనలకు సిద్ధపడ్డారు. కానీ ఈ ఆందోళన కార్యక్రమాలను సైతం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అలెర్ట్ అయింది. నిధులు విడుదల చేయడమే కాదు.. ఇదంతా జగన్ సర్కార్ పాపమేనని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తోంది.
* పోరుబాట పేరిట ఆందోళనలు
ఏపీలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్( fees reimbursement )4 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైసిపి బోరుబాట పెట్టింది. ఫీజు పోరు పేరుతో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడే వద్దని.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉన్నప్పుడు చేయవచ్చని పార్టీ శ్రేణులు సూచించాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయవలసిందేనని జగన్ తేల్చి చెప్పారు. గత నెల చివర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. కానీ అప్పట్లో వాయిదా వేశారు. ఈనెల 29న నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు కూడా మరోసారి వాయిదా వేసి ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సొంత పార్టీ శ్రేణులే సెటైర్లు వేస్తున్నాయి.
* పెండింగ్ బిల్లుల విడుదల
అయితే వైసిపి( YSR Congress ) వాయిదాల పర్వాన్ని గమనించింది కూటమి ప్రభుత్వం. అందుకే తెలివిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి.. నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటికే కొంత మొత్తం రిలీజ్ చేసింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది. అధినేత కార్యాచరణ లేకపోవడంపై నేతలు ఆక్షేపిస్తున్నారు. ఇలా అయితే కష్టమని బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఒక ఏడాది సమయమైన ఇవ్వాల్సి ఉందని.. అప్పటివరకు పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ అధినేత పోరాడుదాం అంటూనే.. వాయిదాల పర్వంతో గడిపేస్తున్నారు.