Homeఆంధ్రప్రదేశ్‌Guntur SP on Jagans Convoy: లింగయ్య మృతికి జగన్ కాన్వాయ్ కు సంబంధం...

Guntur SP on Jagans Convoy: లింగయ్య మృతికి జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదట..

Guntur SP on Jagans Convoy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పల్నాడు జిల్లాలో ఈరోజు పర్యటించిన సంగతి తెలిసిందే. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓవైసీపీ నేత విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. పోలీసుల ఆంక్షలు మధ్య ఆయన పర్యటన సాగింది. పరిమిత సంఖ్యలో వెళ్లాలని పోలీసులు సూచించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. బైకులతోపాటు కార్లలో వైసీపీ శ్రేణులు అధినేత జగన్మోహన్ రెడ్డిని అనుసరించారు. అయితే జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. జగన్ పర్యటనలో అపశృతి అంటూ వార్తలు వచ్చాయి. రోజంతా మీడియాలో దీనిపై డిబేట్లు నడిచాయి. కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందినా జగన్మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు పట్టించుకోవడంలేదని విమర్శలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు గుంటూరు ఎస్పీ. ఆ ప్రమాదం పై మాట్లాడారు.

Also Read: Jagan : జగన్ పాదయాత్ర.. 2.0 విశ్వరూపం తప్పదా?

ఆరు గంటలపాటు ఆలస్యం..
జగన్మోహన్ రెడ్డి పర్యటన 6 గంటలపాటు ఆలస్యంగా ప్రారంభం అయింది. ఏడాది కిందట వైసీపీకి చెందిన నాగమల్లేశ్వరరావు( nagamalleswara Rao ) అనే నేత ఆత్మహత్య చేసుకున్నారు. ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులతోనే ఆయన ఆ ఘటనకు పాల్పడ్డారు అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించడం, విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజకీయ రంగు పులుముకుంది. జగన్ వైఖరి మూలంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. మరోవైపు ఇటీవల జగన్ పర్యటనల నేపథ్యంలో ఎదురవుతున్న పరిణామాల దృష్ట్యా.. పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. అయినా సరే విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు జగన్ మోహన్ రెడ్డి.

Also Read: Jagan: మళ్లీ జగన్ వస్తే..? టీడీపీ భయపడుతోందా?

స్పందించిన గుంటూరు ఎస్పీ..
అయితే జగన్ కాన్వాయ్ ( conway )వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందారని రోజంతా ప్రచారం జరిగింది. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు గుంటూరు ఎస్పీ శ్రీధర్. చనిపోయిన వృద్ధుడి పేరు సింగయ్య అని.. ఆయనను సీఎం క్యాన్వాయ్ వాహనం ఢీకొట్టలేదని స్పష్టత ఇచ్చారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో వెంగలాయపాలెనికి చెందిన సింగయ్య అనే వ్యక్తిని టాటా సఫారీ ఢీకొని రోడ్డు పక్కన పడిపోయాడని.. పోలీసులు వచ్చేవరకు ఎవరూ పట్టించుకోలేదని.. పోలీసులు వచ్చి గుంటూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో తెల్లవారు నుంచి జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular