Pawan Kalyan vs Chiranjeevi: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం ఉన్న మూడు సినిమాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి కేవలం అభిమానుల్లోనే కాదు, మూవీ లవర్స్ లో కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా కాలం వరకు ఆగిపోయింది. దీంతో ఒకప్పుడు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కాస్త తగ్గింది. పైగా గడిచిన రెండు మూడేళ్ళలో ఆడియన్స్ మైండ్ సెట్ బాగా మారిపోయింది. కమర్షియల్ సినిమాలను స్టార్ హీరోలు చేస్తే చూడడం మానేస్తున్నారు. కేవలం పాన్ ఇండియా రేంజ్ స్కోప్ ఉన్న సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు.
పైగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తమిళ సూపర్ హిట్ ‘తేరి’ కి రీమేక్ అనే ప్రచారం జరగడం ఈ సినిమా హైప్ పై బాగా ప్రభావం చూపించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని రెండు గ్లింప్స్ వీడియోస్ చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థమైంది. సరికొత్త సబ్జెక్టు తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. కమర్షియల్ సినిమాలు ఈమధ్య కాలంలో మామూలు సీజోన్లో ఆడడం లేదు కానీ, సంక్రాంతి సీజన్ లో మాత్రం దంచి కొట్టేస్తున్నాయి. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ని 2026 సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్స్ లో ఉన్నారట ఆ చిత్ర నిర్మాతలు. ప్రస్తుతం గత పది రోజుల నుండి హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతుంది. సెప్టెంబర్ నెలాఖరు లోపు సినిమా షూటింగ్ ని మొత్తం పూర్తి చేస్తారట మేకర్స్.
అయితే సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) మూవీ విడుదల కాబోతుంది. ఆ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఆ చిత్రం సంక్రాంతికి వచ్చేస్తుంది. మరి ప్రయోగాలకు పెట్టింది పేరు లాంటి మైత్రీ మూవీ మేకర్స్ ఒకే సీజన్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తలపడే పరిస్థితి కల్పిస్తాడా? అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముందుగా షూటింగ్ పూర్తి అయ్యాక మెగాస్టార్ చిరంజీవి తో మైత్రీ మూవీ మేకర్స్ చర్చలు జరుపుతారట. సంక్రాంతికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అనిపిస్తేనే ఈ చిత్రాన్ని సంక్రాంతికి దింపుతారట. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి అవుతుందట. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.