CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC election) బరిలో దిగి చంద్రబాబు ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారా? జగన్ కు ఎదురైన పరిణామం చంద్రబాబుకు తప్పదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా దాని ప్రభావం చూపక తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు- కృష్ణా.. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ రెండు చోట్ల పోటీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. ప్రస్తుతం తెలుగుదేశం, పిడిఎఫ్ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి టిడిపి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, పిడిఎఫ్ అభ్యర్థిగా డివి రాఘవులు పోటీ చేస్తున్నారు. కృష్ణా- గుంటూరు జిల్లాల నుంచి టిడిపి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిడిఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పోటీలో ఉన్నారు.
* మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం
ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో( graduates MLC elections ) టిడిపి అభ్యర్థులు విజయం సాధించడానికి చంద్రబాబు గట్టిగానే కృషి చేస్తున్నారు. మంత్రులతో పాటు కూటమి ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు స్థానాలు గెలవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అయితే గెలుపు అంత ఈజీ కాదు. సజావుగా ఎన్నికలు జరిగితే మాత్రం పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపు లాంచనమే. కానీ అధికార పార్టీ కావడంతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ రెండు ప్రాంతాల్లోనూ కోటమి బలంగా ఉంది. అందుకే టిడిపి విజయాన్ని కూడా ఎవరు కాదనలేరు. అయితే ఈ రెండు చోట్ల టిడిపి గెలిచినా.. ఓడినా కూటమికే రాజకీయంగా నష్టం.
* టిడిపి సర్వశక్తులు
అధికార పార్టీగా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party). దీంతో పిడిఎఫ్ రూపంలో కొత్త శత్రువు తయారవుతుంది. ప్రజా సంఘాల్లో పని చేసేవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారు. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేకంగా మారుతారు. అయితే వైసిపి పక్కకు తప్పుకోవడం.. టిడిపికి ప్రత్యర్థిగా నిలిచే పిడిఎఫ్కు అండగా నిలుస్తుంది. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహం చల్లారుతుంది. అలాగని తెలుగుదేశం పార్టీ మెత్తబడితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సాయంతో పిడిఎఫ్ అభ్యర్థులు సునాయాస విజయం సాధిస్తారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.
* ఆ వర్గాలన్నీ దూరం
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులను పెట్టి చంద్రబాబు( Chandrababu) కోరిక కష్టాలను తెచ్చుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిడిఎఫ్ అంటేనే ప్రజా సంఘాల సమాఖ్య. అందులో ఉండేది ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు. మొన్నటి ఎన్నికల్లో ఈ వర్గాలన్నీ కూటమికే మద్దతు నిలిచాయి. ఇప్పుడు వారిని దూరం చేసుకుంటున్నారు చంద్రబాబు. గట్టిగా పని చేస్తే ఈ ఎన్నికల్లో ఆ వర్గాలన్నీ కూటమికి దూరమవుతాయి. పోనీ వెనక్కి తగ్గితే ఓటమి తప్పదు. అదే జరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయింది అన్న వాదన కు బలం చేకూరుతుంది. అందుకే చంద్రబాబు నిర్ణయం తప్పు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి కష్టాన్ని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో..