Government Teachers : ఏపీలో( Andhra Pradesh) ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం అవుతోంది. బదిలీల చట్టం ప్రకారం ఈ ప్రక్రియ జరగనుంది. అయితే కోర్టు కేసుల కారణంగా కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న వారికి ప్రాధాన్యతపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈనెల 15 నుంచి బదిలీలు ప్రారంభించాలని భావిస్తున్నారు. సీనియారిటీ జాబితాలు సిద్ధం కాగా.. ఆన్లైన్ లో బదిలీలు జరుగుతాయి. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం బదిలీలు చేపట్టాలని భావిస్తోంది. కానీ దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బదిలీల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో టీచర్లకు “పరీక్ష” పెడుతున్న ప్రభుత్వం
* ఆ పోస్టులకు మినహాయించి..
అయితే న్యాయస్థానం స్టేటస్ కో( status co ) విధించడంతో.. ఎవరికైతే అభ్యంతరాలు ఉంటే వారి పోస్టులను మినహాయించి.. మిగిలిన బదిలీలు పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వారికి ఆప్షన్ పెట్టుకునే అవకాశం కూడా ఇస్తారు. టీచర్ల బదిలీల్లో విడాకులు తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే వారి బదిలీలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 15 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేస్తోంది. గతంలో తీసుకొచ్చిన జీవో 117 కు ప్రత్యామ్నాయంగా పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈసారి బదిలీలు పూర్తిగా ఆన్ లైన్ లోనే జరుగుతాయి.
* మొదట హెచ్ఎం లకు బదిలీలు..
తొలుత హెచ్ఎంల( headmasters ) బదిలీలు ఉంటాయి. తరువాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. తరువాత మిగతా ప్రక్రియ ఉంటుంది. మే 31 నాటికి ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. అలాగే ఐదేళ్లు సర్వీస్ పూర్తయిన హెచ్ఎం లకు కూడా బదిలీ ఉంటుంది. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మోడల్ స్కూళ్లకు ఈ చట్టం వర్తించదు. పాఠశాలల వారీగా పాయింట్లు ఇస్తారు. క్యాటగిరి 1 కి ఏడాదికి ఒక పాయింట్, క్యాటగిరి 2 కు రెండు, క్యాటగిరి మూడుకు మూడు, క్యాటగిరి నాలుగులో ఉన్నవారికి ఐదు పాయింట్లు ఇస్తారు. హెచ్ఆర్ఏ తో పాటు రోడ్డు రవాణా కారణంగా ఈ కేటగిరి లో మార్పులు ఉంటే పాయింట్లు మార్పులు ఉంటాయి.
* అలా చేయవచ్చు..
బదిలీలపై అపీల్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే గ్రీవెన్స్ కు( grievance) వెళ్లవచ్చు. ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకే పాయింట్లు ఉంటే సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటారు. వయసును కూడా పరిశీలిస్తారు. ఎవరైనా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయివుంటే నెలకు ఒకటి చొప్పున గరిష్టంగా పది మైనస్ పాయింట్లు ఉంటాయి. మే 31 నాటికి పదవీ విరమణ చేసిన పోస్టులతో సహా ఖాళీలను బట్టి చేస్తారు. బదిలీల కౌన్సిలింగ్ వల్ల వచ్చే వాటిని ఖాళీలుగా చూపిస్తారు. జిల్లాలోని మొత్తం ఖాళీలను అవసరాల మేరకు మండలాలకు సర్దుబాటు చేస్తారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో టీచర్లకు “పరీక్ష” పెడుతున్న ప్రభుత్వం