Mudragada Padmanabham : ఏపీ పొలిటికల్ సర్కిల్లో ముద్రగడ పద్మనాభం కు ప్రత్యేక స్థానం. కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఎన్నో ప్రభుత్వాలను గడగడలాడించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు. ఒకసారి ముద్రగడ ప్రభుత్వానికి లేఖ రాశారంటే ప్రజల్లోకి బలంగా వెళ్లేది. 2014 నుంచి 2019 మధ్య తన లేఖలతో చంద్రబాబు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లోనే వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చగలిగారు. ఇప్పుడు అదే లేఖాస్త్రాలతో విరుచుకుపడాలని భావిస్తున్నారు ముద్రగడ. కానీ అవి ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు. ప్రభుత్వాలు కూడా లైట్ తీసుకుంటున్నాయి. ఇటీవల చంద్రబాబుకు ఒక లేఖ రాశారు ముద్రగడ. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని.. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కానీ ముద్రగడ లేఖపై పెద్దగా చర్చ జరగలేదు. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. దీంతో ముద్రగడను ప్రభుత్వంతో పాటు ప్రజలు లైట్ తీసుకుంటున్నట్లు అర్థమైంది.
* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
ముద్రగడ పద్మనాభం సీనియర్ మోస్ట్ లీడర్. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో మంచి గుర్తింపు పొందగలిగారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఎంపీగా కూడా పార్లమెంట్లో అడుగు పెట్టారు. చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చేశారు. 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం పై పెద్ద యుద్ధమే నడిపించారు. జీవో 30 ని తెచ్చుకొని కాపుల్లో ఒక రకమైన గుర్తింపు పొందగలిగారు. అయితే రాజకీయ నిర్ణయాల్లో తప్పిదాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు.
* ఇమేజ్ తగ్గుముఖం
అయితే ముద్రగడ ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆయనపై చాలా రాజకీయ పార్టీలు ఆధారపడేవి. కానీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని ఆయన భావించారు. కానీ ఆశించిన స్థాయిలో పవన్ కళ్యాణ్ మొగ్గు చూపకపోవడంతో ఆయన మనస్థాపంతో వైసీపీలో చేరారు. అయినా సరే వైసిపి ఒక్క నియోజకవర్గాన్ని అయినా గోదావరి జిల్లాల్లో గెలవలేదు. దీంతో వైసీపీ సైతం ఆయనను పక్కన పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. మొన్న పిఠాపురం వెళ్లిన జగన్ కనీసం ముద్రగడ వైపు చూడలేదు. అయితే మునుపటిలా ఆయన లేఖలు రాయడం ప్రారంభించారు. కానీ లేఖలకు కూడా పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. దీంతో ముద్రగడ పని అయిపోయిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Government ignores letters written by mudragada padmanabham on super six schemes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com