Gorantla Madhav: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. చివరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. వారిని గుంటూరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో వీరందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే గోరంట్ల మాధవ్ అరెస్టు నుంచి రిమాండ్ వరకు అనేక రకాల ఉత్కంఠ కొనసాగింది. ట్విస్ట్ ల మీద ట్విస్టులు కొనసాగాయి. చివరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: పొన్నవోలు ఔట్.. తెరపైకి అంబటి!
* చేబ్రోలు కిరణ్ పై దాడి..
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తో( Jagan Mohan Reddy) పాటు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్. ఆయనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయగా.. అరెస్టు చేయాలని ప్రభుత్వం సైతం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కిరణ్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు అతడిని స్టేషన్కు తరలిస్తుండగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడ్డుకున్నారు. అయితే పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరో ఐదుగురిపై కూడా కేసులు కొనసాగాయి. పోలీస్ కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన గోరంట్ల మాధవ్ ను మీడియా ముందుకు ప్రవేశపెట్టేందుకు గుంటూరు పోలీసులు సిద్ధమయ్యారు.
* తెరపైకి లాజిక్ అంశాలు.
అయితే తనను మీడియా ముందుకు ఎలా తీసుకెళ్తారని.. మాజీ ఎంపీగా ఉన్న తనను క్రిమినల్ గా ఎలా చూపిస్తారు అంటూ గోరంట్ల మాధవ్ ( gorantla Madhav )ఎదురు తిరిగారు. పోలీసుల తోనే వాగ్వాదానికి దిగారు. చివరికి ఆయనను మీడియా ముందు ప్రవేశ పెట్టకుండానే వైద్య పరీక్షలు చేయించి నేరుగా కోర్టుకు తరలించారు. గుంటూరు కోర్టులో గోరంట్ల మాధవ్ రిమాండ్ కోరారు పోలీసులు. దీంతో న్యాయమూర్తి రెండు వారాలపాటు రిమాండ్ విధించారు. నెల్లూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే అక్కడ ఏర్పాట్లు సరిగా లేవని.. తీసుకెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి నెల్లూరు జైలుకు కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
* గోరంట్ల మాధవ్ అతిపై విమర్శలు..
అయితే చేబ్రోలు కిరణ్ విషయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అతి చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ కోణంలో ఆలోచించి మాధవ్ అలా చేశారని విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గోరంట్ల మాధవ్ కు సరైన నియోజకవర్గం లేదు. ఏదైనా ఒక నియోజకవర్గ బాధ్యతలు తనకు ఇవ్వాలని కోరుతూ వచ్చారు గోరంట్ల మాధవ్. కానీ జగన్మోహన్ రెడ్డి అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ మెప్పు కోసమే చేబ్రోలు కిరణ్ పై దాడికి దిగారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.