Ponnavolu Sudhakar Reddy: పొన్నవోలు సుధాకర్ రెడ్డి( panavolu Sudhakar Reddy ).. చంద్రబాబు అరెస్టు సమయం నుంచి ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ సమయంలో సిఐడి తరఫున బలమైన వాదనలు వినిపించారు. ఒకానొక దశలో సుప్రీంకోర్టు లాయర్ల కంటే తాను తెలివైన వాడినని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో చంద్రబాబును 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచడంలో పొన్నవోలు పాత్ర ఎక్కువగా ఉంది. అయితే అప్పట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉండే పొన్నవోలు వైసిపి ప్రభుత్వం అధికారానికి దూరం కావడంతో.. ప్రభుత్వ వకీలు కొలువు కూడా పోయింది. అయితే ప్రస్తుతం వైసిపి నేతలు కేసులు ఎదుర్కొంటున్న దృష్ట్యా.. లీగల్ టీం బాధ్యతలను పొన్నవోలుకు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే పొన్నవోలు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఆయన కంటే ఎక్కువగా లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు అంబటి రాంబాబు. చక్కనైన వాదనలతో ఆకట్టుకుంటున్నారు.
Also Read: జనరేషన్ Z.. అందరి దృష్టి వారిపైనే.. ఎందుకంటే..
* కీలక కేసులన్నీ నిరంజన్ రెడ్డికి..
అయితే జగన్( Jagan Mohan Reddy) తనతో పాటు కీలక నేతల కేసులను లాయర్ నిరంజన్ రెడ్డికి అప్పగిస్తున్నారు. కింద స్థాయి నేతల కేసులను మాత్రం పొన్నవోలుకు అప్పగిస్తున్నారు. కానీ కేసులు డీల్ చేయడంలో మాత్రం పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారు. తాజాగా గోరంట్ల మాధవ్ కేసులో నవ్వుల పాలయ్యారు. లోక్సభ స్పీకర్ అనుమతి లేనిదే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించే సరికి కోర్టులో ఉన్న వారంతా వింతగా చూశారు పొన్నవోలు వైపు. ఇంకా వైసీపీ అధికారంలో ఉందని.. గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నారని భావించి పొన్నవోలు ఆ వాదనలు వినిపించినట్టు ఉన్నారు. దీంతో ఒక్కసారిగా పొన్నవోలు విషయంలో చర్చ ప్రారంభమైంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. ఆయనతో కేసులు పెట్టుకుంటే ఇక తమకు ఇబ్బందులు తప్పవు అని వారు భావిస్తున్నారు.
* రాణిస్తున్న అంబటి
అయితే అదే సమయంలో అంబటి రాంబాబు( ambati Rambabu) లాయర్ సేవలను ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. అదే గోరంట్ల మాధవ్ అరెస్టు సమయంలో పోలీసులతో వాదనకు దిగారు అంబటి. సెక్షన్లతో ఇచ్చి పడేసారు. మరోవైపు తాను పెట్టిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. నల్లకోటు వేసుకుని తన వాదనలను తానే వినిపించుకున్నారు. అయితే భయపడిన పోలీసులు అంబటి ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. అలా కేసులు నమోదు చేసినట్లు కోర్టుకు కూడా నివేదించారు. అంటే అంబటి సక్సెస్ అయినట్టే కదా. అటువంటప్పుడు పొన్నవోలు ఎందుకు.. అంబటి రాంబాబుకు వైయస్సార్ కాంగ్రెస్ లీగల్ టీం బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
* చక్కటి ట్రాక్ రికార్డ్
అంబటి రాంబాబుకు చక్కటి ట్రాక్ రికార్డ్( track record) ఉంది. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. జగన్మోహన్ రెడ్డిని ఆరాధన భావంతో చూస్తుంటారు. తనకు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించినా ఒక్క అసంతృప్తి వ్యక్తం చేయలేదు. వచ్చే ఎన్నికల్లో అంబటి సేవలను పార్టీకి వినియోగించుకుంటారని అంతా భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అంబటి రాంబాబుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. అవసరం అనుకుంటే అంబటికి అసిస్టెంట్ గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించాలని కోరుతున్న వారు ఉన్నారు.