Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డానికి సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలంలోనే పింఛన్లను రూ. 4 వేలు అందించి వృద్ధుల మన్ననలు పొందారు. ఆ తరువాత వివిధ వర్గాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోంది. తాజాగా మహిళల కోసం ఓ బృహత్తర అవకాశాన్ని కల్పించారు. వ్యవసాయం చేయాలని ఆసక్తి ఉన్న మహిళల కోసం రూ. 6 లక్షల వరకు లోన్లు ఇవ్వనున్నారు. అయితే ఈ లోన్ తో ఓ పరికరం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటి ద్వారా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరికరం కొనుగోలు చేయడానికి కేంద్రం కూడా సాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కల్పించి లోన్ సౌకర్యం కల్పిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘రాష్ట్రీయ వికాస యోజన (RKVY), సబ్ మిషన్ అగ్రికల్చర్ మెకానిజమ్ అనే పథకాలను ప్రవేశపెట్టింది. వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు వీలుగా యంత్రాల కొనుగోలు చేస్తే వాటికి ఈ పథకం ద్వారా సబ్సిడీ ఇస్తుంది. అయితే ఈ పథకం అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయేకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంది. దీంతో కేంద్రానికి చెందిన ఈ పథకాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది.
రాష్ట్రీయ వికాస యోజన (RKVY) ద్వారా వ్యవసాయానికి సంబంధించిన డ్రోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉంటుంది. ఇందులో రూ.4 లక్షల వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగతా రూ.6 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత ఖజానా లేనందున ఈ రూ.6 లక్షల కోసం రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఇందులో రూ. 1 లక్షను రాష్ట్ర ప్రభుత్వం Self Help Group(SHG) కింద అందిస్తుంది. ఇక లోన్ తీసుకున్న తరువాత డీసీసీబీల ద్వారా డ్రోన్లను అందిస్తారు. ఈ డ్రోన్ ను మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు.
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వ్యవసాయంలోనూ వారిదే కీలక పాత్ర ఉంది. అయితే పంటలకు పిచి కారి చేసే సమయంలో మగవాళ్లతోనే సాధ్యమవుతుంది. అయితే మాన్యువల్ గా పిచ్ కారి చేయడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కో డ్రోన్ ద్వారా 10 లీటర్ల పురుగుల మందుతో ఎకరం పంట మొత్తం పిచికారీ చేయగలదు. మాన్యువల్ గా చేస్తే 200 లీటర్ల అవసరం పడుతుంది. పైగా ఒక్కో ఎకరం 6 నిమిషాల్లో పూర్తవుతుంది.
మహిళలు ఈ రంగంలో రాణించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ పథకాన్ని 2022లోనే వైసీపీ అందుబాటలోకి తీసుకొచ్చింది. కానీ అమలు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని అమలుకు కసరత్తు ప్రారంభించింది. డ్రోన్లను మహిళలకు పంపిణీ చేసిన తరువాత వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ తరువాత వారు నేరుగా వారు ఉపయోగించుకోవచ్చు.