Homeఆంధ్రప్రదేశ్‌Milk Price Hike in AP : ఏపీ రైతులకు శుభవార్త

Milk Price Hike in AP : ఏపీ రైతులకు శుభవార్త

Milk Price Hike in AP : ఏపీలో పాడి రైతులకు అమూల్ గుడ్ న్యూస్ చెప్పింది. పాలసేకరణ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. లీటర్ కు గరిష్టంగా గేదె పాలపై రూ.4.51, ఆవు పాలపై రూ. 1.84 ధర పెంచింది.  కనిష్టంగా గేదె పాలపై రూ.2.26, ఆవు పాలపై రూ. 0.11 చొప్పున పెంచినట్టు ప్రకటించింది. కేజీ వెన్నపై రూ. 32, ఇతర ఘన పలకు విస్తరించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రదార్థాలపై రూ. 11 మేర పెంచింది. రాయలసీమలోని 6 జిల్లాలకు ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా పెంపుతో గరిష్టంగా లీటర్ గేదె పాలకు రూ.87.77, ఆవు పాలకు రూ. 42.98 చొప్పున చెల్లించనున్నారు.

సహకార రంగంలో పాల డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో అంతర్జాతీయంగా పేరొందిన అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబరులో జగనన్న పాలవెల్లువకు శ్రీకారం చుట్టింది.  తొలుత రెండు ఉమ్మడి జిల్లాలతో ప్రారంభమై దశలవారీగా ఏడు ఉమ్మడి జిల్లాల్లో అమలవుతోంది.

అమూల్‌ సంస్థ ప్రారంభంలో పాల సేకరణకు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ కలిగిన ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతులకు చెల్లించింది. అయితే గత 17 నెలల్లో మూడుసార్లు సేకరణ ధరలను అమూల్‌ పెంచడంతో రైతులకు లాభం చేకూరింది. తాజాగా నాలుగోసారి సేకరణ ధరలను పెంచింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular