Vastu Tips Wind Chains: మనం వాస్తును నమ్ముతాం. వాస్తుకు ప్రాధాన్యం ఇస్తుంటాం. మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటాం. వాస్తు ప్రకారం ఏ వస్తువులు ఉంచుకోవాలే నిర్ణయించుకుని వాటిని పెట్టుకుంటాం. అలా వాస్తును నమ్ముకుని చాలా పనులు చేస్తాం. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉంచుకునే విండ్ చైన్ల గురించి తెలుసుకుందాం. అవి ఏం చేస్తాయో చూద్దాం.
ఆనందకరం
ఇంట్లో విండ్ చైన్లు ఉంచుకోవడం వల్ల మంచి వాతావరణం నెలకొంటుంది. ఇంట్లోకి అనుకూల శక్తి ఆవహిస్తుంది. అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో విండ్ చైన్లు ఉండాల్సిందే. వాటి ధ్వని వినిపించాల్సిందే. వాటి శ్రావ్యమైన సంగీతం ఇంట్లోకి అనుకూల శక్తుల ఆగమనానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆర్థిక పురోభివృద్ధి కలిసొస్తుంది. అందుకే విండ్ చైన్లను ఉంచుకోవడం వల్ల మంచిది.
ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి
విండ్ చైన్లను ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఎటు వైపు ఏర్పాటు చేసుకుంటే అదృష్టం కలిసొస్తుందని వాస్తు నిపుణులు వివరించారు. తలుపు లేదా కిటికీ లకు వాటిని అలంకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అవి కదులుతుంటే వాటి నుంచి వచ్చే శబ్ధాలు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇంట్లో ప్రశాంతత వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
ఎన్ని రకాలుగా..
చెక్క, లోహం, టెర్రాకోటా, పింగాణి మెటీరియల్ తో చేసిన విండ్ చైన్లు మనకు మార్కెట్ లో అందుబాటులో కనిపిస్తాయి. ఇంట్లో, ఆఫీసులో, వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా వీటిని అలంకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇవి చేసే ధ్వని మనకు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. అందుకే విండ్ చైన్లను ఆరుబయట వేలాడదీస్తే శుభాలు కలుగుతాయి. కానీ చెట్లకు వేలాడదీయొద్దు. కేవలం ఇంట్లోనే అమర్చుకోవాలి.
ఏ దిశలో..
విండ్ చైన్లను ఏ దిశలో అమర్చుకుంటే మంచిదో చూద్దాం. పడమర వైపు అమర్చుకుంటే అదృష్టం కలిసొస్తుంది. వాయువ్యంలో లోహపు విండ్ చైన్లు పెట్టుకుంటే ఇంట్లోకి సంపద వస్తుంది. నైరుతిలో ఏర్పాటు చేసుకుంటే దాంపత్య జీవితంలో ఆనందం, ఉత్తరంలో అమర్చుకుంటే అదృష్టం కలుగుతుంది. నైరుతి, ఈశాన్యం, ఆగ్నేయంలో మట్టి లేదా పింగాణితో చేసిన విండ్ చైన్లు ఉంచుకోవడం శ్రేయస్కరం. దక్షిణ, తూర్పు లేదా ఆగ్నేయంలో చెక్కతో చేసినవి ఉంచుకోవాలి.