DWAKRA women scheme: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వారికోసం కొత్తగా రెండు పథకాలను ప్రారంభిస్తోంది. అందులో ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, మరొకటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ రెండు పథకాలు డ్వాక్రా మహిళలకు అండగా నిలవనున్నాయి. వక్ర మహిళల పిల్లల చదువులకు, ఆడబిడ్డల బిల్లులకు ఆర్థిక సహాయం అందించనుంది ప్రభుత్వం. సెర్ఫ్ పరిధిలోని స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. వారం కిందట ఈ పథకాలు ప్రారంభించాల్సి ఉంది. కానీ మరో 10 రోజుల్లో వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ రెండు పథకాల ద్వారా లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. వీటికి కేవలం పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది. నిజంగా సద్వినియోగం చేసుకుంటే ఈ రెండు పథకాలు ఉత్తమమైనవి.
పిల్లల చదువుల కోసం..
డ్వాక్రా మహిళల కుటుంబాల్లో పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని అమలు చేయనున్నారు. కనీసం 6 నెలలు పాటు డ్వాక్రా సంఘంలో ఉన్నా.. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లిస్తున్న వారు కూడా అర్హులు. బయోమెట్రిక్ ఆధారంగా ఈ రుణాలు ఇస్తారు. కనిష్టంగా 10,000 రూపాయలు, గరిష్టంగా లక్ష రూపాయలు రుణంగా పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం ఈ రుణం తీసుకోవచ్చు. పాఠశాలలు, కాలేజీల్లో పిల్లల ఫీజులకు తగ్గట్టు అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు. దీనికి పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది. గరిష్టంగా 48 వాయిదాలలో తిరిగి చెల్లించాలి. దరఖాస్తు చేసేటప్పుడు అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదు సమర్పించాలి.
ఆడపిల్లల వివాహాలకు..
ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. అయితే ఇది కేవలం రుణంగానే. పదివేల రూపాయల నుంచి లక్ష వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణానికి నాలుగు శాతం వడ్డీ మాత్రమే. గరిష్టంగా 48 వాయిదాలలో తిరిగి చెల్లించాలి. తీసుకున్న రుణ మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది. లగ్నపత్రిక, అదే శుభలేఖ, పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలను సమర్పించాలి. పెళ్లి వివరాలను పరిశీలించిన తర్వాత.. నగదును నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ రెండు పథకాలకు గాను ప్రభుత్వం ఏడాదికి రూ.2000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడుతోంది. మొత్తానికి అయితే డ్వాక్రా సంఘాల మహిళలకు ఇది నిజంగా శుభవార్త.