Devi Sri Prasad vs Thaman: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక తెలుగులో ఒకప్పుడు కీరవాణి, మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలా సినిమాలకు సంగీతాన్ని అందించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు…ఇక వాళ్ల తర్వాత దేవిశ్రీప్రసాద్ ఎంట్రీ ఇచ్చి ప్రతి సినిమా ఆల్బమ్ సక్సెస్ అయ్యే విధంగా చాలా కేర్ఫుల్ గా మ్యూజిక్ అయితే అందించాడు. అతని మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన సాంగ్స్ ఇప్పుడు విన్నా కూడా మంచి ఫీల్ కలుగుతోంది…ఇక వీళ్ల తర్వాత తమన్ ఇండస్ట్రీ కి వచ్చాడు. చాలా తక్కువ సమయంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. తమన్ మ్యూజిక్ లో కొంతవరకు కాపీ ట్యూన్స్ ఉంటాయి అంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికి ఆయన తన పంథా ను మారుస్తూ మ్యూజిక్ ను కొత్తగా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అలాగే ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు సైతం సూపర్ సక్సెస్ గా మారడంతో ఆయన ఎక్కడ తగ్గకుండా మంచి మ్యూజిక్ ని ఇవ్వడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు…ఇక కీరవాణి రాజమౌళి సినిమాలకే మాత్రమే మంచి మ్యూజిక్ ని అందిస్తున్నాడు. మిగతా వాళ్ళ సినిమాలకు ఇచ్చినా కూడా అవి పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండడం లేదు.
ఇక మణిశర్మ వరుస సినిమాలు చేస్తున్నప్పటికి ఆయన ఇండస్ట్రీలో పెద్దగా బిజీగా అయితే లేడు…ఇక గత కొద్ది రోజుల వరకు దేవిశ్రీప్రసాద్ – తమన్ లా మధ్య చాలా పెద్ద పోటీ ఉంది అంటూ వార్తలైతే వచ్చాయి. కానీ ‘పుష్ప 2’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఆ తర్వాత చేసిన సినిమాలేమి పెద్దగా కలిసి రావడం లేదు.
ఇక ఆయన ప్రస్తుతం ఒక్క పెద్ద సినిమా చేయడం లేదు. దీంతో వీలైనంత తొందరగా దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ అనేది ముగియబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి… తమన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. రీసెంట్ గా ‘ఓజీ’ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘డాకు మహారాజుకి సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు.
ఇప్పుడు ‘ఓజీ’ సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తుంటే తమన్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…మొన్నటి వరకు దేవి శ్రీ ప్రసాద్ తో పోటీ పెట్టుకున్న తమన్ ఇప్పుడు దేవిని పక్కన పెట్టి వార్ వన్ సైడ్ చేసేసాడు. తనకు పోటీ ఎవరూ లేరు, ఎవరు రారు అనే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…