Vizag IT Companys Development: ఉమ్మడి ఏపీలో( Andhra Pradesh) హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు వచ్చిన తర్వాత ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖచిత్రం కూడా మారనుంది. ఏపీకి దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ రానుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఏపీకి గేమ్ చేంజర్ కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు గూగుల్ 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. దీంతో లక్షలాది ఉద్యోగాలు రానున్నాయి.
Also Read: షర్మిల జగన్ కు రాఖీ కడతారా ?
ఆసియాలోనే పెద్ద ప్రాజెక్ట్..
గూగుల్ సంస్థ( Google company) విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దదిగా తెలుస్తోంది. భారతదేశంలో మొదటి ప్రత్యక్ష డేటా సెంటర్ కూడా కానుంది. ఇప్పటికే గూగుల్ సింగపూర్, మలేషియా, థాయిలాండ్లలో సైతం విస్తరించింది. ఈ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు సంబంధించి మధురవాడలో 500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. ప్రాథమికంగా 80 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే విశాఖకు ఈ దిగ్గజ ఐటీ సంస్థ రావడం మాత్రం నవ్యాంధ్రప్రదేశ్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?
ఎన్నో అంశాలకు దాహదం.. విశాఖలో( Visakhapatnam) గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో.. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకుఎంతగానో దోహదపడనుంది. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, యూట్యూబ్, సెర్చ్ ఇంజిన్ వంటి గూగుల్ సేవలను ఇది మరింత ఊతం ఇవ్వనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సాంకేతిక శిక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాలలో మరిన్ని పెట్టుబడులు వస్తాయి. రెండు బిలియన్ డాలర్ల పునరుత్పాదక శక్తి పెట్టుబడి.. పర్యావరణ స్థిరత్వాన్ని కూడా ప్రోత్సహించనుంది. ఇది భారతదేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. విశాఖపట్నం ఆసియా ఖండంలోనే డిజిటల్ హబ్ గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.