Geethanjali: గీతాంజలి చనిపోయింది 7న.. వైసీపీ ప్రచారం 8 నుంచి.. అసలేం జరిగింది?

మంత్రి రోజా ఈ ఘటనపై స్పందించారు. ఐ టీడీపీ, జనసేన సోషల్ మీడియా వల్లే ఆమె చనిపోయారని ఆరోపణలు చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

Written By: Dharma, Updated On : March 12, 2024 5:14 pm

Geethanjali

Follow us on

Geethanjali: ఏపీలో రాజకీయాలు గీతాంజలి అనే సాధారణ మహిళ చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమె చావుకు మీరంటే మీరు కారణమంటూ రాజకీయ పార్టీలు పరస్పరం దూషించుకుంటున్నాయి. వైసిపి ప్రభుత్వం ద్వారా తాము లబ్ధి పొందామని ఓ యూట్యూట్ ఛానల్ తో ఆమె మాట్లాడగా.. ఒకే లబ్ధిదారులకు రెండు సార్లు ఇల్లు ఎలా వచ్చింది? అమ్మ ఒడి ప్రారంభించి ఐదు సంవత్సరాలు కాకున్నా.. ఆమెకు ఐదుసార్లు ఆ పథకం ఎలా వచ్చింది? అని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వైసీపీ ప్రభుత్వమే ఇలా పెయిడ్ ప్రమోషన్ చేస్తోందని ఆరోపించారు. సీన్ కట్ చేస్తే ఈనెల 7న తెనాలికి చెందిన గీతాంజలి రైలు కిందపడి తీవ్ర గాయాల పాలైంది. ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో ఆమె సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు బలంగా ఆరోపిస్తున్నారు. దీనికి టిడిపిని కారణమని చెబుతున్నారు.

మంత్రి రోజా ఈ ఘటనపై స్పందించారు. ఐ టీడీపీ, జనసేన సోషల్ మీడియా వల్లే ఆమె చనిపోయారని ఆరోపణలు చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అటు ఆమెపై ట్రోలింగ్స్, ఆపై అనుచిత కామెంట్స్ చేసిన సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల దృష్టి పెట్టారు. వాటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. బాధిత కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

మరోవైపు ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. అధికారిక ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది.’ తెనాలికి చెందిన గీతాంజలి కి రైలు ప్రమాదం ఈనెల 7న జరిగింది. ఐదు ఏళ్ళు అమ్మఒడి ఇచ్చారని.. ఇల్లు కట్టించారని ఆమె మాట్లాడే సరికి.. వైసిపి చేస్తున్న ఫేక్ ప్రచారం అని సోషల్ మీడియాలో 8వ తేదీ నుంచి పోస్టులు మొదలయ్యాయి. కానీ టిడిపి వల్లే ఏడో తేదీ ఆత్మహత్య చేసుకుందని చెప్పేవాళ్లు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అని ప్రశ్నించారు. అలాగే గీతాంజలి మృతి వెనక ఇద్దరు వైసీపీ నేతలు ఉన్నారని.. ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఆమె ఎందుకు.. ఎలా చనిపోయింది.. ఆమె మృతికి కారణం ఎవరో తేలాలి’.. అంటూ టిడిపి తమ అధికారిక ట్విట్టర్ లో ట్విట్ చేసింది. దీంతో ఆమె ఆత్మహత్య ఘటన రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది.