https://oktelugu.com/

Sankranti Holidays: ఏపీలో సంక్రాంతి సెలవులపై ఫుల్ క్లారిటీ.. ఎన్ని రోజులో తెలుసా?

రాష్ట్రంలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. దాదాపు పది రోజులు పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది సిలబస్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతి సెలవులు కుదించారు అన్న వార్తలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 27, 2024 / 10:18 AM IST

    Sankranti Holidays(1)

    Follow us on

    Sankranti Holidays: ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులపై కూటమి ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇదివరకు ప్రకటించిన మేరకు మాత్రమే సెలవులు ఉంటాయని.. అందులో ఎటువంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 2024 -25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ఇచ్చిన సెలవుల నేపథ్యంలో..సంక్రాంతి సెలవులు తగ్గిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. సోషల్ మీడియాలో కేవలం ఐదు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఉంటాయని వార్తలు వచ్చాయి. 11 నుంచి 15 తేదీ…లేదా 12 నుంచి 16 తేదీల్లో మాత్రమే సెలవులు ఉంటాయని పెద్ద ఎత్తున వార్తలు నడిచాయి. అయితే అందులో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్ముద్దని విజ్ఞప్తి చేసింది కూటమి ప్రభుత్వం.

    * రెండు ఆప్షనల్ హాలిడేస్
    క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అయితే 24 తో పాటు 26వ తేదీలను ఆప్షనల్ హాలిడేస్ గా ప్రభుత్వం పేర్కొంది. దీంతో చాలా పాఠశాలలు మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చాయి. మరోవైపు 2025 సెలవుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 2025లో 23 సాధారణ సెలవులు, 21 అప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. సాధారణ సెలవులతో పాటు ఆప్షనల్ హాలిడేలు కలుపుకొని మొత్తంగా 44 రోజులు సెలవులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో నాలుగు సెలవులు ఆదివారం వచ్చాయి. రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం రోజే రావడం గమనార్హం.

    * ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన
    అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు ముంచెత్తాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చాలా జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే ఈ ప్రభావం సిలబస్ పై పడింది. ఈ తరుణంలో సంక్రాంతి సెలవులు కుదించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. సంక్రాంతి సెలవులు కుదించారు అన్న నేపథ్యంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఏపీలో ప్రధాన పండుగ సంక్రాంతి. ఎంత దూరంలో ఉన్నా సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ముందస్తుగానే క్యాంపులు ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది. సెలవులపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.