Salute to Chandrababu: దావోస్( davos ) పర్యటన ముగించుకొని చంద్రబాబు రాష్ట్రానికి చేరుకున్నారు. ఈరోజు సచివాలయానికి వచ్చారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశానికి విచ్చేశారు సీఎం చంద్రబాబు. గత ఐదు రోజులుగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. విశ్రాంతి తీసుకోలేదు. నేరుగా బ్యాంకర్ల సమావేశానికి వచ్చారు. వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, గృహ నిర్మాణం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అయితే ఈసారి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన రుణ పరిమితి పెంచినట్లు బ్యాంకర్లు చంద్రబాబుకు వివరించారు.
స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు..
ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను స్వగ్రామం నారావారిపల్లెలో( Nara Vari Palle ) జరుపుకున్నారు చంద్రబాబు. కుటుంబ సమేతంగా వెళ్లారు. ఈనెల 19న దావోస్ పర్యటనకు వెళ్లారు. మూడు రోజులపాటు ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు. క్షణం తీరిక లేకుండా గడిపారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆయన హైదరాబాద్ వచ్చి విశ్రాంతి తీసుకుంటారని అంతా భావించారు. కానీ హైదరాబాదులో ఉండకుండా నేరుగా సచివాలయానికి వచ్చారు. వరుసగా సమీక్షలు చేస్తున్నారు.
పర్యటనలతో బిజీబిజీ..
చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చింది. ఏడుపదుల వయసులో కూడా ఆయన పాత చంద్రబాబు మాదిరిగా కష్టపడుతున్నారు. ప్రతి నెలలో ఢిల్లీ పర్యటనలు, విదేశీ పర్యటనలు( foreign Tours ) కొనసాగిస్తున్నారు. పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతూనే.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర పెద్దలతో సైతం సమన్వయం చేసుకుంటున్నారు. ఈ వయసులో చంద్రబాబు ఓపిక, రాష్ట్ర అభివృద్ధికి పడుతున్న తపనను నేషనల్ మీడియా ప్రత్యేకంగా గుర్తించింది. ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రతినిధులను పంపించి ఊరుకోకుండా.. తానే స్వయంగా పెట్టుబడుల సదస్సుకు వెళ్లడాన్ని కూడా ప్రశంసిస్తోంది. జాతీయస్థాయిలో ఇదే హైలెట్ అవుతోంది.