Koratala Siva Sensational comments: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara varaprasad garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతికి రెండు రోజుల ముందు బ్యాటింగ్ మొదలు పెడితే, ఇప్పటికీ ఆ బ్యాటింగ్ ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కి సరైన పాజిటివ్ టాక్ వస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ విద్వంసం ఉంటుందో చెప్పడానికి ఈ చిత్రం థియేట్రికల్ రన్ ఒక ఉదాహరణ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూలు కడుతున్న తీరుని చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆగేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలలో పెద్దగా సినిమాలేవీ లేవు కాబట్టి, ఈ సినిమా ఆ నెలలో కూడా మంచి రన్ ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఆచార్య మూవీ డైరెక్టర్ కొరటాల శివ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి ఈ విషయం గురించి ప్రస్తావించాడు. ఆయన మాట్లాడుతూ ‘మన శంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ అవ్వగానే ఇండస్ట్రీ మొత్తం నుండి ప్రముఖులు నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా హీరో నితిన్ నుండి మెసేజ్ వచ్చింది. సినిమా చూసిన వెంటనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ , అందులో ఎలాంటి సందేహం లేదు, కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి అన్నాడు. ఇక ఆ తర్వాత మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, నిఖిల్, విజయ్ దేవరకొండ వంటి వారు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. వీవీ వినాయక్ అయితే తన సొంత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యినంత సంతోషించాడట.
ఇక కొరటాల శివ గురించి మాట్లాడుతూ ‘ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ గారు కూడా ఈ సినిమాని చూసిన వెంటనే నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. చాలా సంతోషం తో దాదాపుగా అరగంట సేపు మాట్లాడాడు ఆయన’ అంటూ చెప్పుకొచ్చాడు. కొరటాల శివ, చిరంజీవి మధ్య ఆచార్య సినిమా విషయం లో చిన్నపాటు మనస్పర్థలు ఏర్పడ్డాయని చాలా రోజుల నుండి సోషల్ మీడియా లో చర్చించుకుంటున్న అంశం. కానీ కొరటాల శివ మాత్రం ‘వాల్తేరు వీరయ్య’ హిట్ అయ్యినప్పుడు కూడా బాబీ కి ఇలాగే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. దీనిని బట్టీ వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.