Government Employee: అమ్మ నవమాసాలు మోస్తే మనం భూమ్మీదికి వస్తాం. నాన్న పక్కలో అమ్మ పడుకుంటే మనం భూమ్మీదికి వస్తాం.. రెండు నిజాలే.. అమ్మలో త్యాగాన్ని చూసినవాడు గొప్పవాడు అవుతాడు. నాన్న పక్కలో పడుకున్న కామాన్ని చూసినవాడు దుర్మార్గుడు అవుతాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఇప్పుడు మీరు చదువుతున్న కథనంలో వ్యక్తి ఈ ఉపోద్ఘాతంలో రెండవ కేటగిరికి చెందినవాడు.
సాధారణంగా మనకంటే వయసులో చిన్న వారిని చూస్తే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. వారితో మాట్లాడుతుంటే.. తెలియని విషయాలు చెబుతుంటే గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యక్తి తనకంటే చాలా చిన్న అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ఒకరకంగా ఆ అమ్మాయి మైనర్ కూడా. తెలిసి తెలియని వయసు ఆమెది. వీడిదేమో కామంతో కళ్ళు మూసుకుపోయిన వయసు. ఆ అమ్మాయి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. ఆమెకు లేనిపోని మాటలు చెప్పాడు. అంతే.. తన ట్రాప్ లో పడిన తర్వాత శారీరకంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. చివరికి ఈ విషయం బయటపడింది. దీంతో అతడు ఆ అమ్మాయి శీలానికి వెలకట్టాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని చెన్నూరు మండలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చెన్నూరు మండలంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయాడు. అక్కడికి 16 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆ బాలిక స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. కడప జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఓ వ్యక్తి నిత్యం చెన్నూరు మండలానికి వస్తూ ఉంటాడు. ఆ బాలిక తండ్రి చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న అతడు నిత్యం ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇలా ఆ కుటుంబంతో, ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అతని మాటల వెనుక ఉన్న మోసాన్ని ఆ బాలిక గమనించ లేకపోయింది. అతడు రెవెన్యూ ఉద్యోగి కావడంతో లొంగిపోయింది. ఇదే అదునుగా అతడు ఆమెతో కామ కలాపాలు సాగించాడు. ఈ వ్యవహారం ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు అతడిని నిలదీశారు. అయినప్పటికీ అతడు వారిని పట్టించుకోలేదు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొందరు అధికారులు రంగ ప్రవేశం చేసి.. పోలీసుల సమక్షంలోనే ఆ బాలిక కుటుంబానికి లక్ష ఇప్పించే విధంగా పంచాయితీ చేశారు.