Free Gas Cylinder : ఏపీ ప్రభుత్వం( government) గుడ్ న్యూస్ చెప్పింది. దీపం 2 కింద రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 1 వరకు ఈ ఉచిత రెండో సిలిండర్ను బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకటి చొప్పున.. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. లబ్ధిదారులు నగదు చెల్లించి సిలిండర్ తీసుకున్న 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ప్రభుత్వం.
Also Read : కొడాలి నానికి బైపాస్ సర్జరీ…. ఆందోళనలో అభిమానులు!
* సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా..
చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో( super six schemes ) భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయం ఉంది. గతంలో చంద్రబాబు దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు.
* గత ఏడాది దీపావళి నుంచి..
గత ఏడాది దీపావళికి( Diwali) ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. తొలి సిలిండర్ అప్పుడే అందించారు. ఇప్పుడు తాజాగా అందిస్తోంది రెండో సిలిండర్. ఈ ఏడాది చివర్లో మరో సిలిండర్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మధ్యతరగతి ప్రజలు నిత్యవసరాల పెరుగుదలతో సతమతం అవుతున్నారు. వారికోసం ఈ దీపం పథకాన్ని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. సాధారణంగా ఏడాదికి ఓ కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు అవసరం ఉంటుంది. అందులో మూడు సిలిండర్లను ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తొలుత అందించింది ఈ పథకమే.
* ఏడాదికి రూ.2700 ఆదా
గ్యాస్ సిలిండర్( gas cylinder) ధర 900 రూపాయల వరకు ఉంది. ఏడాదికి మూడు సిలిండర్లు అంటే దాదాపు రూ.2700 వరకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకంపై ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. అన్నింటికీ మించి ఎన్నికల హామీగా అమలవుతోంది. మరోవైపు వచ్చే నెల నుంచి ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే అంతకంటే ముందే ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రకటించింది. ప్రభుత్వం వరుసగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!