Kannappa : మంచు విష్ణు(Manchu Vishnu) ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). తన డ్రీం ప్రాజెక్ట్ గా ప్రతీ సందర్భంలో చెప్పుకుంటూ వచ్చిన విష్ణు, ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసాడు. అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చేశారట. రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohanlal) వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు రెండు టీజర్స్, మూడు పాటలు ఈ సినిమా నుండి విడుదల అయ్యాయి. టీజర్స్ కి పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు కానీ, మూడు పాటల్లో రెండు పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండు పాటలు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిందని చెప్పొచ్చు.
Also Read : కన్నప్ప’ విడుదల వాయిదా..కారణం ఏమిటంటే!
అయితే ఏప్రిల్ 25న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించింది మూవీ టీం. ఇది ఇలా ఉండగా మొన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షోని కొంతమంది మీడియా ప్రతినిధులతో కూర్చొని మోహన్ బాబు, మంచు విష్ణు వీక్షించారని మీడియా లో ఒక న్యూస్ వ్యాప్తి చెందింది. దీనిపై మూవీ టీం స్పందిస్తూ, ‘మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా ఈ సినిమా ప్రివ్యూ షో ప్రదర్శన ఎక్కడా జరగలేదు. మొదటి కాపీ ఇంకా రెడీ అవ్వలేదు. కేవలం ఒక 15 నిమిషాల ఫుటేజీ ని థియేటర్ లో VFX క్వాలిటీ చెకప్ మూవీ టీం తో కలిసి థియేటర్ లో చూసాము’ అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.
VFX విషయం లో మూవీ టీం ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదని ఈ సందర్భంగా ఆడియన్స్ అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని మొత్తం న్యూజిల్యాండ్ అడవుల్లో చిత్రీకరించారు. టీజర్ లో ఉన్న షాట్స్ ని చూస్తుంటే మన నేటివిటీ కి బాగా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదే విషయాన్ని మంచు విష్ణు వద్దకు తీసుకెళ్లగా, రెండు దశాబ్దాల క్రితం మన దేశంలో అడవులు ఇలాగే ఉండేవని, అంతటి పచ్చదనం ఇప్పుడు మన అడవుల్లో బాగా తగ్గిపోవడం వల్లనే న్యూజిల్యాండ్ లో చిత్రీకరించామని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది ఇంకా ఖరారు కాలేదు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించింది, కానీ మంచు విష్ణు డబ్బులు ఊహకందని రేంజ్ లో డిమాండ్ చేయడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ వెనక్కి తగ్గారు. అలా ఓటీటీ డీల్ క్లోజ్ కాకుండానే థియేటర్స్ లోకి రాబోతున్న సినిమాగా ‘కన్నప్ప’ చిత్రం నిల్చింది.
Also Read : కన్నప్ప మూవీ పై ట్రోల్స్ చేస్తే సర్వ నాశనమైపోతారు – మూవీ టీం