Vijayasai Reddy Exemption from arrest: వైయస్సార్ కాంగ్రెస్ మాజీ నేతకు మినహాయింపు ఇస్తున్నారు ఎందుకు? ఆయన అరెస్టు ఎందుకు జరగడం లేదు? ఆయన కుటుంబ సభ్యులపై ఆలస్యంగా ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారు? కోర్టు ఆదేశాలను సైతం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆయన విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? కేంద్రం నుంచి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? లేకుంటే పొలిటికల్ అప్రూవర్ గా ఆయన మారారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి మాజీ నేత విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి పై కేసులు నమోదయ్యాయి. పది రోజుల కిందట కేసులు నమోదు చేయగ ఆలస్యంగా వెలుగులోకి రావడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది.
వైసిపిలో కీలక పాత్ర..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. అంతకుముందు 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఏకంగా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడ్డారు. జాతీయస్థాయిలో బిజెపి నుంచి టిడిపిని దూరం చేయగలిగారు. అదే సమయంలో బిజెపి నుంచి వైసీపీకి పరోక్ష సహకారం అందేలా కృషి చేయడం వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారు. అటువంటి విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో హవా కొనసాగించారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు.
Also Read: అప్పుడు లోకేష్.. ఇప్పుడు పెద్దిరెడ్డి.. రాజమండ్రిలో నివాసం!
వైసీపీ హయాంలో హవా..
ముఖ్యంగా ఉత్తరాంధ్రకు( North Andhra) ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. పేరుకే సీనియర్ మంత్రులు కానీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఉత్తరాంధ్ర ఉండేది. ముఖ్యంగా విశాఖ నగరాన్ని శాసించారు. ఆయన కుటుంబం సైతం పెద్ద ఎత్తున దోపిడీకి దిగిందని అప్పటి విపక్ష టిడిపి తో పాటు జనసేన ఆరోపించింది. చివరకు సొంత పార్టీ నేతలు సైతం విజయసాయిరెడ్డి పై అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా భీమిలి బీచ్ ను ఆక్రమించి మరీ నిర్మాణాలు చేశారని ఆయన కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి పై ఫిర్యాదులు ఉన్నాయి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ దీనిపై న్యాయపోరాటం చేశారు. వారి ఖర్చుతోనే ఆ నిర్మాణాలను తొలగించాలని కోర్టు రెండుసార్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే అలా తొలగించడంలో కూడా జాప్యం జరిగింది. ఇప్పుడు తీరప్రాంత పరిరక్షణకు విఘాతం కల్పించారంటూ వచ్చిన ఫిర్యాదులు మేరకు వారిద్దరిపై కేసులు నమోదయ్యాయి. కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ బయట పెట్టకపోవడం విశేషం.
అరెస్టు నుంచి మినహాయింపు..
మద్యం కుంభకోణంలో( liquor scam) విజయసాయిరెడ్డి ఏ 5 నిందితుడు. కానీ రెండుసార్లు ఆయనను విచారణకు పిలిచారు. నిందితుడిగా కంటే సాక్షిగానే ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. మూడోసారి విచారణకు పిలిస్తే తనకు పది రోజుల సమయం కావాలని ఆయన సమాచారం ఇచ్చారు ప్రత్యేక దర్యాప్తు బృందానికి. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులైన 12 మంది అరెస్ట్ అయ్యారు. కానీ విజయసాయిరెడ్డిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. అంటే విజయసాయిరెడ్డి విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ఆయన రాజకీయంగా అప్రూవర్ గా మారిపోయారని.. అందుకే ఆయనను టచ్ చేయడం లేదని ఒక టాక్ ఉంది. మరి ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.