Avanthi Srinivasa Rao Shock to Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి మరో మాజీ మంత్రి షాక్ ఇవ్వనన్నారు. కూటమి పార్టీలో చేరనున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది తాజా మాజీ మంత్రులు కూటమి పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాకపోవడంతో చాలామంది పునరాలోచనలో పడ్డారు. సేఫ్ జోన్ చూసుకున్నారు. కూటమిలో అనుకూల పార్టీని ఎంచుకొని వెళ్లిపోయారు. కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు వైసీపీని వీడే పరిస్థితి లేదు. వేరే పార్టీలో చేరలేరు కూడా. అయితే తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టిడిపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి టిడిపి హై కమాండ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.
పిఆర్పి ద్వారా ఎంట్రీ
అవంతి శ్రీనివాసరావు( Avanthi Srinivas Rao ) ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. విశాఖలోనే నాలుగు సీట్లలో విజయం సీట్లలో విజయం సాధించింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ను అనుసరించారు అవంతి శ్రీనివాస్. 2014లో గంటా శ్రీనివాసరావు తో పాటు టిడిపిలో చేరారు. అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గంటా తో కొనసాగితే తనకు మంత్రి పదవి రాదని భావించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం గంటా శ్రీనివాసరావు చేతిలో అదే భీమిలి నుంచి ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫుల్ సైలెంట్ అయ్యారు అవంతి. క్రమేపి పార్టీకి దూరం కావడంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు.
Also Read: ఆ వైసీపీ మాజీ నేతకు మినహాయింపు!
గంటా శ్రీనివాసరావు అభ్యంతరం..
అవంతి శ్రీనివాసరావు టిడిపిలో( Telugu Desam Party) చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే అవంతిరాకను గంటా శ్రీనివాసరావు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే టిడిపిలో తన పాత పరిచయాలను ఉపయోగించుకొని ఎంట్రీ ఇచ్చేందుకు అవంతి శ్రీనివాసరావు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అవి వర్క్ అవుట్ కావడంతో త్వరలో టిడిపిలో చేరడం ఖాయమని సమాచారం. అయితే గంటా శ్రీనివాసరావును కాదని అవంతిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం కుదిరే పని కాదని తెలుస్తోంది. అసలే మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నారు గంటా శ్రీనివాసరావు. ఇటువంటి సమయంలో అవంతి శ్రీనివాసరావును తెస్తే తప్పకుండా ఆయన అభ్యంతరం పెడతారు. అయితే అవంతి శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకురావాలని బలమైన నేతలు ప్రయత్నించారు. దీంతో గంటా శ్రీనివాసరావు సైతం అడ్డు చెప్పే పరిస్థితి కనిపించడం లేదు.
టికెట్ హామీ తోనే..
2029 ఎన్నికల్లో టికెట్ హామీపైనే అవంతి శ్రీనివాసరావు చేరుతున్నట్లు తెలుస్తోంది. అవంతి విద్యాసంస్థల చైర్మన్ గా ఆయన సుపరిచితులు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2009 నుంచి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఓడిపోవడంతో తన వ్యాపార రీత్యా ఇబ్బందులు వస్తాయని భావించారు. అందుకే పూర్వాశ్రమం టిడిపిలో చేరితే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే గంటా శ్రీనివాసరావు భీమిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నందున.. త్వరలో పునర్విభజనలో ఏర్పాటు కానున్న కొత్త నియోజకవర్గానికి అవంతికి టిక్కెట్ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.