Rohit Sharma (5)
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం తన కుమారుడు అ హాన్ తో గడుపుతున్నాడు. ఇటీవల టీమిండియా రోహిత్ ఆధ్వర్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. వన్డేలలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. అంతకుముందు రోహిత్ నాయకత్వంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది.
Also Read: యజువేంద్ర చాహల్ తో సంబంధం..ఆర్జే మహ్వేష్ సంచలన పోస్ట్..
వెస్టిండీస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుపై 12 పరుగుల తేడాతో టీమిండియా విజయపతాకం ఎగరవేసింది. ఈ విజయం ద్వారా దాదాపు 17 సంవత్సరాల అనంతరం టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబైలోని తన కుటుంబంతో గడుపుతున్నాడు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయానికి కేటాయిస్తున్నాడు. భార్య రితిక, కూతురు సమైర, కుమారుడు అహాన్ తో కలిసి సమయం గడుపుతున్నాడు.. తన కుమారుడు అహాన్ ఎత్తుకొని అతడు లాలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనంగా మారాయి. రితిక గత ఏడాది అహాన్ కు జన్మనిచ్చింది. ఆ సమయంలో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగగా.. అందులో టీం ఇండియా విజయం సాధించింది. టీమ్ ఇండియాకు బుమ్రా నాయకత్వం వహించాడు. ఇక మిగతా టెస్టులకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. టీమిండియా కు ఒక్క విజయాన్ని కూడా అందించలేకపోయాడు. దీంతో టీమ్ ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు అప్పగించింది. గత రెండు సీజన్ల లో టీమిండియా విజేతగా నిలిచింది. కానీ ఈసారి మాత్రం విఫలమైంది. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం.. అంతకుముందు న్యూజిలాండ్ చేతిలోనూ మూడు టెస్టుల్లో పరాజయం పాలు కావడంతో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లలేకపోయింది.
2027 వరకు ఆడతాడట
ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు.. టీమ్ ఇండియా ఒకవేళ ట్రోఫీని గెలుచుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ తన వన్డే కెరియర్ కు ముగింపు పలుకుతాడని అందరూ అనుకున్నారు.. గత ఏడాది టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. కానీ ఈసారి రోహిత్ అలా చేయలేదు.. తాను రిటైర్మెంట్ ప్రకటించడం లేదని స్పష్టం చేశాడు. తను క్రికెట్ ఇంకా ఆడాల్సి ఉందని వివరించాడు. విశ్వసనీయ వర్గాల ప్రకారం 2027 వరకు రోహిత్ వన్డే ఫార్మాట్ లో కొనసాగుతాడని తెలుస్తోంది. 2027లో దక్షిణాఫ్రికా, నమిబియా, కెన్యా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ మెగా టోర్నీలో టీమిండియాను విజేతగా నిలిపి వన్డేక్ ఫార్మాట్ కు వీడ్కోలు పలకాలని రోహిత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కూడా జరుగుతుంది. అందులో కూడా విజయం సాధించి… టీమిండియా కు అన్ని ఫార్మాట్లలో ఐసిసి ట్రోఫీలు అందించిన కెప్టెన్ గా నిలిచిపోవాలని రోహిత్ భావిస్తున్నాడని క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
Also Read: తండ్రితో సంతోషాన్ని పంచుకున్న విరాట్ కోహ్లీ.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..