Sakshi Office Fire: గత కొద్దిరోజులుగా ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార కూటమి ప్రభుత్వానికి, వైసిపి నాయకులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సాక్షి ఛానల్ నిర్వహించిన డిబేట్లో కృష్ణంరాజు అమరావతి మహిళలను కించపరచినట్టు వ్యాఖ్యలు చేశారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక అప్పట్నుంచి ఏపీలో పరిస్థితిలో ఒక్కసారిగా మారిపోయాయి.
కృష్ణంరాజు డిబేట్లో మాట్లాడుతున్న సమయంలో.. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ క్రమంలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని ఆపడానికి ప్రయత్నించలేదని.. అమరావతి మహిళలను కించపరుస్తుంటే.. ఆయన చూస్తూ ఊరుకున్నారని.. పైగా జాతీయ మీడియాలో నేను కూడా ఆ వార్తలు చూశానని పేర్కొన్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మహిళలు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం హైదరాబాద్ వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో హాజరు పరిచారు. కేసు విచారించిన న్యాయమూర్తి ఆయనను రిమాండ్ కు తరలించారు. ఇక ఈ ఘటన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి.. సోషల్ మీడియాలో కూటమినేతలు, వైసిపి నాయకులు పోటా పోటీగా పోస్టులు పెడుతున్నారు. కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.
సాక్షి కార్యాలయానికి నిప్పు
ఇక మంగళవారం ఏలూరులోని సాక్షి కార్యాలయానికి కొంతమంది నిప్పు పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో కార్యాలయంలో ఫర్నిచర్, సోఫా సెట్లు కాలిపోయాయి. ఆఫీసు ఎదుట ఉన్న ఒక కారుని కూడా కొంత మంది దొంగలు చేశారు. అయితే ఇదంతా కూడా టిడిపి, బిజెపి నేతల పని అని వైసిపి ఆరోపిస్తోంది.. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని టిడిపి, బిజెపి నాయకులు అంటున్నారు..” కొద్దిరోజులుగా సాక్షి కార్యాలయం ఎదుట భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇక మంగళవారం ఏకంగా దాడి చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్ కాలిపోయింది.. భారీగా నష్టం వాటిల్లింది. చివరికి కార్యాలయం ఎదుట సిబ్బందికి చెందిన కారుని కూడా తగలబెట్టారు. ఇది ప్రమాదం కాదు. టిడిపి, బిజెపి నాయకులు కావాలని చేసింది.. పత్రిక స్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూడిదైపోతోంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం వణికి పోతోంది. ఇలాంటి పరిస్థితి ఏ పత్రికకు కూడా రాలేదు.. చంద్రబాబు పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాత్రికేయులకు భద్రత లేదు.. ప్రజాస్వామ్యం నగు బాటుకు గురవుతోందని” సాక్షి తన కథనాలలో పేర్కొంది.
ఇక ఏలూరు జిల్లాలోని రాజానగరం ప్రాంతంలో ఉన్న సాక్షి ప్రాంతీయ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కొంతమంది దుండగులు సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సాక్షి కార్యాలయంలోని ఫర్నిచర్ కాలిపోయింది. సోఫా సెట్లు ధ్వంసమయ్యాయి. కంప్యూటర్లు పాడైపోయాయి.. అయితే దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి లో పనిచేసే ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు క్షేత్రస్థాయిలోకి వచ్చి.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నేతలు
పెట్రోల్ బాటిళ్లతో సాక్షి ఆఫీస్ ను తగలబెట్టిన TDP నేతలు
అగ్నికి ఆహుతైన సోఫాసెట్లు, ఫర్నీచర్
సాక్షి ఆఫీస్ పై దాడి చేస్తున్నా పట్టించుకోని పోలీసులు pic.twitter.com/jN2NOsRGKm
— Rahul (@2024YCP) June 10, 2025